Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా..? అసలు క్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్.. | Rohit Sharma Breaks Silence on 2027 ODI World Cup: Theres Still a Lot of Time, Well See
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్బంగా వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా.. లేదా అనే ప్రశ్నకు హిట్ మ్యాన్ సమాధానమిచ్చారు. 2027 అక్టోబర్‌కు చాలా సమయం ఉందని, దాని గురించి అప్పుడు చూద్దామని బదులిచ్చారు. వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 13 నెలల సమయం ఉంది. దీంతో ఫామ్, ఫిట్‌నెస్…