Headlines

Flipkart Big Billion Days: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..? | Flipkart big billion days 2026.. dates surface online check expected sale period and card offers

Flipkart Big Billion Days-2026: ఫ్లిప్‌కార్ట్ సంవత్సరంలో అతిపెద్ద పండుగ సేల్ అయిన ‘బిగ్ బిలియన్ డేస్’ అతి త్వరలోనే రావచ్చు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న లీకుల ప్రకారం, ఈ-కామర్స్ దిగ్గజం వచ్చే నెలలో తన వార్షిక ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను నిర్వహించనుంది. పండుగ సీజన్‌కు ముందు స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఇతర ఉత్పత్తులపై కొనుగోలుదారులు గణనీయమైన తగ్గింపులను పొందే అవకాశం ఉంటుంది. గత సంవత్సరాల మాదిరిగానే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు కూడా ఇతర వినియోగదారుల…

Read Full News

తిరుమల యాత్ర పూర్తి కావాలంటే ఈ ఆలయాన్ని మర్చిపోవద్దు.. తిరుచానూరులో ఎక్కడుందంటే! | Tiruchanur Surya Narayana Swamy Temple: Why This Temple Is Special During Tirumala Yatra

Tiruchanur Surya Narayana Swamy Temple History Telugu: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే భక్తులు కేవలం కొండపై ఉన్న వేంకటేశ్వర స్వామినే దర్శించుకుని తిరిగి వెళ్లరు. తిరుపతి పరిసరాల్లోని అనేక ప్రాచీన ఆలయాలను కూడా సందర్శించడం ఆనవాయితీ. ముఖ్యంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం తిరుమల యాత్రలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు. అదే తిరుచానూరులో పద్మసరోవరం తూర్పు తీరాన కొలువై ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఎంతో…

Read Full News

ట్విన్ టవర్స్‌పై ఉగ్రదాడికి 25 ఏళ్లు.. భారత ప్రధాని మోదీ ఏమన్నారంటే? | PM Modi on 9/11 25th Anniversary: India’s Unwavering Fight Against Global Terrorism

అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న జరిగిన భయానక ఉగ్రవాద దాడులకు నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం లెక్కలేనన్ని ప్రాణాలను బలిగొందని పేర్కొన్నారు. భారత్‌ దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదానికి బాధితురాలిగా ఉంటూనే, ఉగ్రవాదంపై పోరాటంలో దృఢంగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాద ముప్పు కొనసాగుతున్నప్పటికీ, అన్ని రూపాల్లోని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ…

Read Full News

రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట! | Daily Diya Rituals: What to Add to the Lamp on Each Day of the Week?

Daily Diya Rituals Telugu: హిందూ సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, దీపం వెలుగు సానుకూల శక్తికి, శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీక. పూజా స్థలంలో నిత్యం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన, సానుకూల వాతావరణం నెలకొంటుందని, దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అందుకే కొందరు భక్తులు వారంలోని రోజును బట్టి ఆయా దేవతలకు ఇష్టమైనవిగా భావించే పదార్థాలను దీపంలో వేసి…

Read Full News

నమ్మలేరు కానీ నిజం..! మోటార్‌సైకిల్ కంటే సన్నని కారు.. గిన్నిస్ రికార్డు కొట్టేసిన మెకానిక్! | World’s Narrowest Car: Andrea Marazzi’s 50cm Fiat Panda Claims Guinness Record

మోటార్‌సైకిల్ కంటే సన్నగా ఉండే కారు ఉంటుందని ఊహించగలరా..? రోడ్డుపై చూస్తే ఇది నిజంగా కారు కాదేమో.. ఏదైనా ఫొటోషాప్ లేదా AI సృష్టించిన చిత్రం అనిపిస్తుంది. కానీ ఇది అక్షరాలా నడిచే కారు. కేవలం 50.20 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ వాహనం ఇప్పుడు ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఇటలీకి చెందిన మెకానిక్ ఆండ్రియా మరాజీ చేసిన ఈ ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత ఫియట్ పాండానే…..

Read Full News

Career Astrology: వారికి నీచభంగ రాజయోగం..! 55 రోజులు కెరీర్‌లో ఊహించని పురోగతి | Mars Transit 2026: 6 Zodiac Signs Set for Unexpected Success, Power and Financial Gains

ఈ నెల(సెప్టెంబర్) 18 నుంచి నవంబర్ 12 వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగు తుంది. కర్కాటక రాశి కుజుడికి నీచ స్థానం. అయితే, కుజుడికి ఈ రాశి మిత్ర స్థానం కూడా. కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో యుతి చెందడం వల్ల కుజుడికి నీచభంగం జరుగుతుంది. ఫలితంగా కుజుడు మిత్ర క్షేత్ర ఫలితాల్ని మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. సుమారు 55 రోజుల కర్కాటక రాశి సంచారంలో కుజుడు మేషం,…

Read Full News

ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.. చివరకు చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.. ప్రేమ కన్నీళ్లు.. | Actress Prema Reflects on Legendary Soundarya Life, Career, and Friendship

నటి ప్రేమ, దివంగత లెజెండరీ నటి సౌందర్యతో తనకున్న గాఢమైన అనుబంధాన్ని, తన సినీ ప్రస్థానాన్ని, అలాగే సౌందర్య అద్భుతమైన జీవితాన్ని గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆమె మాటల్లో సౌందర్య జ్ఞాపకాలు, సినీ పరిశ్రమపై వారిద్దరి ప్రభావం స్పష్టంగా కనిపించాయి. ప్రేమ తన సినీ ప్రస్థానం మొదట్లో ఎదుర్కొన్న సవాళ్లను ధైర్యంగా పంచుకున్నారు. కన్నడలో శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్‌లతో నటించిన మొదటి రెండు చిత్రాలు పరాజయం పాలవ్వడంతో ఐరన్ లెగ్ అనే విమర్శను…

Read Full News

సికింద్రాబాద్ – విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్.. 3 గంటలు ఆలస్యంగా బయల్దేరనున్న రైలు | Secunderabad–Vizag Vande Bharat Timing Changed: Check New Departure Time for Train 20834 Today

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ నుంచి నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. శుక్రవారం సెప్టెంబర్ 11, 2026 రోజు సికింద్రాబాద్ నుంచి బయల్దేరాల్సిన రైలు వేళల్లో మార్పు చేసినట్లు ప్రకటించింది. ప్రయాణికులు ముఖ్య గమనిక సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 20834 నెంబర్ గల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సాధారణంగా మధ్యాహ్నం 03:00 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరాల్సి ఉండగా…..

Read Full News

అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు.. | One key opens hundreds of cabins in Norway where no roads, staff or reception exist, only trust

  క్యాబిన్ లోపల రిసెప్షనిస్ట్,  వంటవాళ్లు ఉండరు.  వంట సామగ్రి, ఆహార పదార్థాల స్టాక్ పెద్ద ఎత్తున అందుబాటులో ఉంటుంది. డి.ఎన్.టి. సంస్థ సభ్యత్వం తీసుకున్న ఎవరికైనా ఒక తాళం చెవి ఇస్తారు.  ఆ  ఒక్క తాళం చెవితో నార్వే అంతటా ఎక్కడ ప్రయాణించినా  వందలాది క్యాబిన్‌లను తెరవొచ్చు.   క్యాబిన్ లోపల ఫర్నిచర్ అంతా ఉంటుంది.  పర్వతారోహకులకు అవసరమైన మంచాలు, దుప్పట్లు, వంట చేయడానికి గ్యాస్ స్టవ్‌, చలి కాచుకోవడానికి కట్టెలు,  పాస్తా, సూప్ పౌడర్లు, క్యాన్డ్…

Read Full News

పోయే వయసులో పైశాచికం.. 7 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడి.. | 75 year old man arrested for assault on seven year old girl in srikakulam

శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో 75 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోటబొమ్మాళి మండలం గుంజిలోవ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గుంజిలోవ గ్రామానికి చెందిన కవిటి రామారావు (75) బుధవారం మధ్యాహ్నం ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు అందింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కోటబొమ్మాళి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల…

Read Full News