లడఖ్‌లో దేశంలోనే తొలి వైల్డ్‌లైఫ్ సఫారీ.. మంచు చిరుతలను చూసే అద్భుత అవకాశం! | Ladakh to Launch India’s First High Altitude Wildlife Safari for Snow Leopard Sightings
భారత్‌లో అడవి జంతువులను చూడాలంటే సాధారణంగా పచ్చని అడవులు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, లడఖ్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన లోయలు, రాతి కొండలు, విస్తారమైన నీలి ఆకాశం మధ్య అత్యంత అరుదైన మంచు చిరుతను గుర్తించడం అంత సులభం కాదు. రాళ్ల మధ్య కలిసిపోయే దాని శరీర రంగు కారణంగా శిక్షణ పొందిన కంటికి కూడా అది కనిపించకుండా పోతుంది. అందుకే దీనిని ‘పర్వతాల…