గన్నేరు ఆకులతో పప్పు కూర.. అంగన్‌వాడీలో భోజనం తిని ఐదుగురికి అస్వస్థత! | Oleander Leaves Accidentally Mixed in Anganwadi Meal in Khammam; Three Children, Two Women Fall Sick
ఖమ్మం, సెప్టెంబర్ 4: గన్నేరు ఆకులు పొరపాటున పప్పులో కలవడంతో ఆ భోజనం తిన్న ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంగన్‌వాడీ కేంద్రం 3లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న నాగమణి అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నారు. దీంతో…