కలెక్టర్ అవుతానని చెప్పి.. ఇలా చేశావేంటి తల్లీ.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు..! | IIT Guwahati Student from Andhra Pradesh Dies in Brahmaputra River Father’s Grief Moves Many video
“బాగా చదువుకొని సివిల్స్ రాసి కలెక్టర్ అవుతానమ్మా అని చెప్పావు కదా తల్లీ.. నన్ను ఇలా ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావా?” అంటూ ఆ తండ్రి ఆవేదనతో రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం గ్రామంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. జమ్మలమడుగు తహశీల్దారుగా పనిచేస్తున్న సాయినాథ్ రెడ్డి కుమార్తె చేతన అస్సాంలోని ఐఐటీ గువాహటిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే, అక్కడి బ్రహ్మపుత్రా నది వద్దకు విహారానికి…