అదరగొట్టిన హైదరాబాదీ.. పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం | Hyderabad’s Vivek Reddy Wins Gold for India at Heineken Pickleball World Cup 2026
అంతర్జాతీయ పికిల్‌బాల్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన వివేక్ రెడ్డి ప్రియదర్శిని సత్తా చాటారు. వియత్నాంలోని డా నాంగ్‌లో జరుగుతున్న హీనెకెన్ పికిల్‌బాల్ వరల్డ్ కప్ 2026లో 40+ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. ఇదే టోర్నమెంట్‌లో 40+ పురుషుల డబుల్స్ విభాగంలో మరో హైదరాబాద్ ఆటగాడు శ్రీకర్ మోతుకూరితో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించారు. 40+ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో వివేక్ రెడ్డి.. వియత్నాం నంబర్ వన్ ఆటగాడు హోంగ్ న్గుయెన్‌తో…