Headlines

తల్లి ఆరోగ్యం – పిల్లల భవిష్యత్తు: ‘మన అంగన్‌వాడీ – మన బాధ్యత’ పేరుతతో పోషకాహార విప్లవం! | 9th Rashtriya Poshan Maah: Empowering Communities for Better Nutrition for mothers and children

దేశవ్యాప్తంగా పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కౌమార బాలికలలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆరోగ్య శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ‘రాష్ట్రీయ పోషణ్ మాహ్’ను నిర్వహిస్తున్నారు. 2018లో ప్రారంభమైన ఈ సామూహిక కార్యక్రమం, 2026 సెప్టెంబర్‌లో “హమారీ అంగన్‌వాడీ, హమారీ జిమ్మెదారి” (మా అంగన్‌వాడీ, మా బాధ్యత) అనే ఆదర్శవంతమైన ఇతివృత్తంతో 9వ ఆవృత్తిలోకి ప్రవేశించింది. ఈ ప్రచారం అంగన్‌వాడీ కేంద్రాలను కేవలం ప్రభుత్వ సేవా…

Read Full News

Hyderabad: అర్థరాత్రి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులు.. స్టాప్‌ల వివరాలివే.. | Hyderabad Night Bus Services: More Routes Added, Check Route Wise Stops and Timings

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, అర్ధరాత్రి వేళల్లో ప్రజా రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టి.జి.ఎస్.ఆర్టీసీ ప్రారంభించిన రాత్రిపూట బస్సు సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రయాణికుల విజ్ఞప్తులు, రాత్రిపూట అధిక ట్రాఫిక్ రద్దీ, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఆరు ప్రధాన రూట్లలో రాత్రిపూట ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు….

Read Full News

అలాంటి మనిషిని నేను చూడలేదు..! చాలా గొప్పోడు..!! కానీ 32ఏళ్లకే చనిపోయాడు: రామ్ గోపాల్ వర్మ | Director RGV made interesting comments regarding Bruce Lee’s death

మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో బ్రూస్ లీ ఒక అద్భుతమైన, అసమానమైన వ్యక్తిగా నిలిచారు. 1973లో 32 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన అకాల మరణం పాలవ్వడం ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది, అనేక ఊహాగానాలకు దారితీసింది. “బ్రూస్ లీ 32 ఏళ్లకే ఎందుకు చనిపోయాడు?” అనే ప్రశ్నకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన విశ్లేషణను పంచుకున్నారు. బ్రూస్ లీ సినిమా కెరీర్ “వే ఆఫ్ ది డ్రాగన్”, “బిగ్ బాస్”, “చైనీస్ కనెక్షన్” వంటి చిత్రాలతో మొదలైంది….

Read Full News

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మండలి నుంచి తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెన్షన్.. | BRS MLCs Tatha Madhu and Naveen Reddy Suspended from Telangana Legislative Council

స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.. ఈ తరుణంలో తెలంగాణ మండలి నుంచి తాతా మధు, నవీన్‌ ను సస్పెన్షన్ చేస్తూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మండలి నుంచి తాతా మధు, నవీన్‌ ను సస్పెన్షన్‌ చేశారు.. ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మండలిని రేపటికి వాయిదా వేశారు. అయితే,…

Read Full News

Adivi Sesh: ఆ హీరో చాలా మంచోడబ్బా! రేలంగి మావయ్య లాంటోడు.. అడివి శేష్ కామెంట్స్ వైరల్ | Adivi Sesh Interesting Comments About Actor Karthi At Sardar 2 Pre Release Event

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో విభిన్నమైన కథలతో సినిమాలు తీసే హీరోల్లో శేష్ కూడా ఒకడు. క్షణం, గూడఛారి, ఎవరు, మేజర్ హిట్ 2, డెకాయిట్.. వంటి సినిమాలతో తెలుగులో క్రేజీ హీరోగా మారిపోయాడు శేష్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో గూఢచారి 2 సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు. 2018లో వచ్చిన ‘గూఢచారి’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రానికి…

Read Full News

SBI e-KYC: ఇంట్లోనే ఎస్‌బీఐ ఈకేవైసీ చేసుకోవడం ఎలా? ఈ లింక్‌లను మాత్రం క్లిక్ చేయొద్దు! | SBI e KYC: How to Update Your KYC Online from Home – Step by Step Guide

SBI e-KYC Update: ఎస్‌బీఐ ఖాతాదారులు తమ KYC (Know Your Customer) వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం అవసరం. ప్రస్తుతం ఉన్న ఖాతాకు Re-KYC అవసరమైతే, బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే అధికారిక ఆన్‌లైన్ మార్గాల్లో ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే కేవైసీ పేరుతో వచ్చే నకిలీ SMSలు, వాట్సాప్‌ మెసేజ్‌ల విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా స్వయంగా ఎస్‌బీఐ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించడం…

Read Full News

Chicken: రోజూ చికెన్ తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి | Eating Chicken Every Day? Know These Possible Health Risks

చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉండటంతో చాలామంది తమ రోజువారీ ఆహారంలో దీనికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, వ్యాయామం చేసేవారు చికెన్‌ను తప్పకుండా తమ డైట్‌లో చేర్చుకుంటారు. చికెన్ ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ పరిమితికి మించి లేదా ప్రతిరోజూ ఒకే రకంగా చికెన్ తీసుకోవడం ద్వారా మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. చికెన్‌ను ఎలా వండుతున్నాం? ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం? దానితో పాటు ఏ ఆహారాలను కలిపి తీసుకుంటున్నాం? అనే అంశాలు ఆరోగ్యంపై ప్రభావం…

Read Full News

కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్‌వేర్ యువతి షాకింగ్ నిర్ణయం! | Software Engineer Betrayal: rs 40 Lakhs, Car Given, Boyfriend Cheats, Suicide Attempt in Annamayya District

అన్నమయ్య జిల్లా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. కురబలకోట మండలం అంగళ్లు అవుట్‌పోస్ట్ వద్ద పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌కు చెందిన 29 ఏళ్ల యువతి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది….

Read Full News

Sumanth: మహేంద్రగిరి వారాహిలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి.. హీరో సుమంత్ | Hero Sumanth about Mahendragiri Varahi movie

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ విలేకరుల…

Read Full News

Andhra Weather: ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాల్లో పిడుగులు | Andhra pradesh rain alert thunderstorms in several districts

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు బుధవారం (09-09-2026) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం…

Read Full News