Headlines

Jabardasth : నువ్వా .. మా పక్కన కూర్చోకు.. చాలా అవమానించారు.. జబర్దస్త్ నటుడి ఆవేదన.. | Jabardasth Shanthi Swaroop Recounts Humiliation Over Lady Getups

ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ శాంతి స్వరూప్ తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన అవమానాలను, బాధాకరమైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రధానంగా లేడీ గెటప్‌ల కారణంగా సాటి కళాకారుల నుంచే తాను ఎలా కించపరచబడ్డాడో ఆయన వివరించారు. ఈ సంభాషణ టెలివిజన్ పరిశ్రమలో కళాకారులు ఎదుర్కొనే అంతర్గత సవాళ్లను వెలుగులోకి తెచ్చింది. శాంతి స్వరూప్ మాటల్లో, “ఏయ్, మీరు లేడీ గెటప్ పక్కన కూర్చోకండి,” “మాతో ఫోటోలు దిక్కండి” వంటి మాటలు తనను ఎంతగానో బాధించాయని తెలిపారు….

Read Full News

పిల్లల గొంతుతో ఫోన్.. తల్లిదండ్రులే టార్గెట్‌గా డీప్‌ఫేక్ మోసం! ఈ జాగ్రత్తలు తీసుకోండి.. | AI Deepfake Voice Scam: Fraudsters Clone Children’s Voices to Target Elderly Parents

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని ఉపయోగించి వృద్ధులను టార్గెట్ చేస్తున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లల గొంతును పోలిన స్వరంతో ఫోన్ చేసి.. ప్రమాదం జరిగిందని, పోలీసుల అదుపులో ఉన్నామని లేదా ఆసుపత్రిలో ఉన్నామని చెప్పి అత్యవసరంగా డబ్బులు పంపించాలని మోసగాళ్లు ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని సెకన్ల ఆడియోతోనే గొంతు క్లోన్ సోషల్ మీడియా వీడియోలు, యూట్యూబ్ క్లిప్పులు, వాట్సాప్ స్టేటస్‌లు, ఇతర ఆన్‌లైన్…

Read Full News

Viral Video: కారు బానట్‌లోంచి అదేపనిగా శబ్దాలు.. ఏంటని ఓపెన్ చేయగా.. వామ్మో.. | Seven foot python found inside car bonnet in Mumbai watch viral video

పార్క్‌ చేసిన కారు తీసేందుకు వెళ్లిన ఓ మహిళకు అందులో సుమారు ఏడు అడుగుల పొడవున్న ఓ భారీ కొండచిలువ కనిపించిన ఘటన ముంబై నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. దహిసర్‌ పశ్చిమలోని కందర్పాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న సన్నీ కాంబ్లే అనే వ్యక్తి పక్కనే ఉన్న ఓ చెట్టు కింద తన కారును పార్క్ చేసి ఉంచాడు. అయితే ఇటీవల తన సోదరి కారులో బయటకెళ్దామని కారు తీసేందుకు వెళ్లింది. అయితే కారు బానెట్‌…

Read Full News

200 కాదు, 300లు బాదినా కష్టమేరా ఛోటా ప్యాకెట్.. టీమిండియాలో నీకు చోటు లేదంతే..? | Team india player ishan kishan 270 runs in duleep trophy test team

Ishan Kishan Double Century: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ 270 పరుగులతో చరిత్ర సృష్టించినా.. టీమిండియా టెస్ట్ జట్టులోకి అతని పునరాగమనం ఇప్పటికిప్పుడు కష్టమే. ఈస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్.. సౌత్ జోన్‌తో ఫైనల్లో భారీ డబుల్ సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన టెస్ట్ దావేదారిత్వాన్ని బలపరిచినా, ప్రస్తుత జట్టు కూర్పులో అతనికి స్థానం కనిపించడం లేదని మూల కథనం పేర్కొంది. 270 పరుగుల రికార్డు ఇన్నింగ్స్.. మ్యాచ్ తొలి రోజే…

Read Full News

NEET UG 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో MBBS సీట్లు పెరిగాయ్.. MCC కీలక అప్‌డేట్ | MCC Revises NEET UG 2026 Round 2 Seat Matrix, 30 MBBS Seats Added

హైదరాబాద్‌, సెప్టెంబర్ 8: నీట్ యూజీ 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో మెడికల్ సీట్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సీట్ల మ్యాట్రిక్స్‌ను సవరించింది. తాజా సవరణలో మూడు మెడికల్ కాలేజీలకు సంబంధించి కొత్తగా 30 అదనపు MBBS సీట్లు చేర్చారు. ఈ కొత్త సీట్లను అభ్యర్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో Choice Filling సమయంలో తమ ప్రాధాన్యతల జాబితాలో చేర్చుకునే అవకాశం కల్పించారు. దీంతో మెడికల్ సీటు పొందేందుకు…

Read Full News

YouTuber Nandana: యూట్యూబర్ నందన అరెస్ట్ కేసులో బిగ్‌ అప్‌డేట్! | RGIA Police hands over YouTuber Nandana of Nandus World to Ibrahimpatnam police for questioning

ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్ అయ్యారు. ఉద్యోగాల పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడంతో, ఆమె తన భర్తతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే, తాజాగా ఆమె అమెరికా నుంచి ఎమిరేట్స్ ఈకే-526 విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆమె పాస్‌పోర్ట్ తనిఖీ చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఆమెపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు…

Read Full News

Telangana Assembly: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. తాతా మధు వ్యాఖ్యలపై సభలో కీలక చర్చ.. | Telangana Assembly Session 2026 Day 2: BRS MLC Tata Madhu, Speaker Gaddam Prasad Controversy

తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. తొలిరోజు అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ సభ్యులు నల్ల చొక్కాలు వేసుకుని రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయమే పోలీసులు తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారిని నారాయణగూడ పీఎస్‌కు…

Read Full News

రెండు రోజులు ఇది పూస్తే చాలు.. చేతి, కాలి గోళ్ల ఫంగస్‎ మటుమాయం.. నిర్లక్ష్యం చేస్తే నష్టమే

కాలి, చేతి గోళ్ల చుట్టూ నొప్పితో నిద్ర సరిగా పట్టడం లేదా? గోళ్ల ఫంగస్ తో పాదాలు అందంగా లేవని బాధ పడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవసరం లేదు. దీనికోసం ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతోనే చెక్ పెట్టొచ్చు. మరి , లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. సాధారణంగా మనలో చాలా మందికి చేతి, కాలి గోర్లపై ఫంగల్ సమస్య వస్తుంది. ఈ సమస్యను మొదట్లోనే తుంచేయాలి లేదంటే…

Read Full News

Vaibhav Sooryavanshi: “ఈషాన్ కిషన్‌ను చూసి నేర్చుకో!”.. వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక | Vaibhav sooryavanshi to learn long innings from ishan kishan duleep trophy final

Vaibhav Sooryavanshi: చెన్నై వేదికగా సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కిషన్ 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 270 పరుగులు సాధించాడు. ఈస్ట్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల కొండంత స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఈస్ట్ జోన్ వైపు నుంచి డబుల్…

Read Full News

ISROలో ప్రైవేటీకరణ కలకలం.. కులశేఖరపట్నం లాంచ్ సెంటర్‌పై ఉద్యోగుల వ్యతిరేకత | ISRO Privatization Row: Employees Raise Objections Over Tamil Nadu Launch Centre

సాధారణంగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వంటి ప్రయోగ వాహకాలను సిద్ధం చేసి ప్రయోగించేందుకు నెలల సమయం పడుతుంది. ఒక్కో ప్రయోగానికి రెండు నుంచి మూడు నెలల సమయం కూడా అవసరమవుతుంది. అయితే చిన్న ఉపగ్రహాలను తక్కువ సమయంలో అంతరిక్షంలోకి పంపేందుకు ఎస్ఎస్ఎల్వీ — స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ — అనే కొత్త తరహా ప్రయోగ వాహకాన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. వారం నుంచి పది రోజుల వ్యవధిలోనే ప్రయోగానికి సిద్ధమయ్యేలా దీనిని రూపొందించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన…

Read Full News