Headlines

సెప్టెంబర్ 8 రాశిఫలాలు: మంగళకరమైన రోజు మంగళవారం మీ రాశి ఎలా ఉందంటే..? | Daily Horoscope September 8, 2026: Tuesday Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (సెప్టెంబర్ 8, 2026): ఈ రోజు 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి అంశాల్లో భిన్నమైన ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు కొందరికి ఆదాయం, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు కలిసిరాగా, మరికొందరు ఖర్చులు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వ్యాపారాలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికారుల…

Read Full News

పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీల్లో భారీగా టీచర్ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 18 వరకే ఛాన్స్‌ | Nandyal District Anganwadi Recruitment 2026 for 70 Anganwadi Jobs, Apply by September 18

నంద్యాల జిల్లాలోని మహిళా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ స్త్రీ, శిశు అభివృద్ధి, సాధికారత కార్యాలయం (WDCW) నోటిఫికేషన్ విడుదల చేసింది. WDCW పరిధిలోని 6 ఐసిడియస్ (ICDS) ప్రాజెక్ట్‌లలో ఒప్పంద ప్రాతిపదికన అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 70 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల్లో 3 మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు, 67 అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు…

Read Full News

హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ.. ప్రిన్స్ గురించి ఈ విషయాలు తెలుసా..? | Team India Captain Shubman Gill Birthday Interesting Facts

Shubman Gill Birthday: టీమిండియా స్టార్ బ్యాటర్, టెస్ట్-వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 27వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. 2026 సెప్టెంబర్ 8న బర్త్‌డే చేసుకుంటున్న గిల్.. స్కూల్ క్రికెట్ నుంచి అండర్-19, ఫస్ట్‌క్లాస్, ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ వరకు తనదైన ముద్ర వేశాడు. ఈ సందర్భంగా అతని కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. రితిక్ రోషన్ వల్లే పరాఠాలు..! చిన్నతనంలో పంజాబీ అయినప్పటికీ గిల్‌కు పరాఠాలు తినడం ఇష్టం ఉండేది…

Read Full News

మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు! టెన్త్ పాసైతే చాలు | Andhra Pradesh Govt to Fill 913 ASHA Worker Vacancies by September 30, Check Eligibility, Age Limit and Salary

అమరావతి, సెప్టెంబర్‌ 8: ఆంధ్రప్రదేశ్‌లో ఆశావర్కర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,294 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. తాజాగా మరో 913 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియను జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ నెల 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి…

Read Full News

గణేశుడి 32 రూపాల గురించి తెలుసా? ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే! | 32 Forms of Lord Ganesha: The Spiritual Meaning Behind Each Divine Form

32 Forms of Lord Ganesha Telugu: విఘ్నాలను తొలగించే దేవుడిగా, జ్ఞానానికి అధిపతిగా, శుభకార్యాలకు ఆదిదేవుడిగా గణపతిని హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణేశుడిని పూజించడం ఆనవాయితీ. అయితే గణపతి ఆరాధన కేవలం ఒకే రూపానికి పరిమితం కాలేదు. గణేశుడికి 32 ప్రధాన రూపాలు ఉన్నాయని గణపత్య సంప్రదాయంలో పేర్కొంటారు. ఈ 32 రూపాల్లో ప్రతి ఒక్కటి గణేశుని దైవిక స్వరూపంలోని ఒక ప్రత్యేక గుణాన్ని, శక్తిని లేదా…

Read Full News

Auto News: పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు! | Auto News: Tata punch tops august 2026 sales fada report shift from petrol

Auto News: ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో ఆగస్టు 2026లో రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు జరిగాయి. ఈ డేటాను సెప్టెంబర్ 7న విడుదల చేశారు. మొత్తం వాహన రిజిస్ట్రేషన్లు 24.23 లక్షలకు చేరగా, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 4,02,398 దాటాయి. చరిత్రలో తొలిసారిగా, ప్యాసింజర్ వాహన విభాగంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు పెట్రోల్ మోడళ్లను అధిగమించాయి. కార్ల జాబితాలో టాటా పంచ్ అగ్రస్థానంలో నిలిచింది. భారీ…

Read Full News

ఇదెక్కడి విడ్డూరం.. దొంగల భయంతో కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమావ్వాల్సిందే! | Afraid of Thieves, Bihar Man Parks His New Mahindra Scorpio on a Three Storey Rooftop!

అది బీహార్…అక్కడ ఏమైనా జరగవచ్చు.. ఈ మాట మరోసారి నిజమవుతోంది. బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన ధనస్సుధన్ ప్రసాద్ ఇటీవలే సరికొత్త మహీంద్రా స్కోర్పియో కారును కొనుగోలు చేశారు. అయితే, ఆ ప్రాంతంలో వాహనాల దొంగతనాలు ఎక్కువవుతుండటంతో ఆయనలో భయం మొదలైంది. రోడ్డుపై లేదా ఇంటి బయట పార్క్ చేస్తే దొంగలు ఎక్కడ ఎత్తుకెళ్తారోనని తీవ్రంగా ఆందోళన చెందారు. దీనికి పరిష్కారంగా తన కారును ఎవరూ చేరుకోలేని భవనం పైకప్పుపై ఉంచాలని నిశ్చయించుకున్నారు. ధనస్సుధన్ ప్రసాద్…

Read Full News

స్మార్ట్‌వాచ్‌లో కనిపించే ఆరోగ్య రీడింగ్స్‌ అన్నీ నిజమైన కొలతలేనా? ఏవి నమ్మాలి? | Smartwatch Health Readings Accuracy: What to Trust, When to Consult a Doctor

ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌లు కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాలు కావు. హృదయ స్పందన రేటు, అడుగుల సంఖ్య, నిద్ర, వ్యాయామం, కేలరీల ఖర్చు, రికవరీ వంటి అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్ వివరాలను మణికట్టుపైనే చూపిస్తున్నాయి. దీంతో చాలామంది తమ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోవడానికి స్మార్ట్‌వాచ్ డేటాపై ఆధారపడుతున్నారు. అయితే వాచ్ స్క్రీన్‌పై కనిపించే ప్రతి సంఖ్య శరీరం నుంచి నేరుగా కొలిచినదే అనుకోవడం సరికాదని పరిశోధకులు చెబుతున్నారు. మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల వివరణ…

Read Full News

Xiaomi: షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే..! | Xiaomi Smart Band 11 Active Launched IFA 2026 21 Days Battery Heart Monitor Latest Budget Fitness Tracker Specs details

Xiaomi Smart Band: షియోమీ తన కొత్త Smart Band 11 Activeను ఎంపిక చేసిన దేశాలలో విడుదల చేసింది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ తేలికగా సన్నగా ఉండి, పెద్ద స్క్రీన్‌ను, అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్ ఫీచర్లను అందిస్తుంది. తేలికపాటి వాడకంతో దీని బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాండ్ హృదయ స్పందన రేటు, SpO2, నిద్ర, ఒత్తిడి పర్యవేక్షణ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది 50…

Read Full News

నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు..! ప్రిన్సెస్‌కు దక్కిన అరుదైన అవకాశం?

న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మెట్రోపాలిటన్ ఒపెరా నాటకంలో నటించడం కోసం మనుషులే కాకుండా ఏకంగా పాములు కూడా బాహాటంగా విజయం సాధించడానికి పోటీ పడ్డాయి..! ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు వోల్ఫ్‌గ్యాంగ్ అమడేయస్ మోజార్ట్ రాసిన Così fan tutte అనే క్లాసిక్ ఒపెరాను 1950ల కాలం నాటి కోనీ ఐలాండ్ కార్నివాల్ థీమ్‌తో ప్రదర్శిస్తున్నారు. ఈ కథలో కార్నివాల్ వాతావరణాన్ని ప్రతిబింబించేందుకు ఒక స్నేక్ చార్మర్ పాత్ర,దానికి తోడుగా నిజమైన పాము అవసరమైంది. పాములకు ఆడిషన్లు ఎలా నిర్వహించారు?…

Read Full News