Headlines

ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? మీ రోజును మార్చేసే సింపుల్ అలవాట్లు ఇవే..! | Morning Vastu Tips: Follow These Simple Rituals for Positivity, Peace and Prosperity

Morning Vastu Tips Telugu: ఉదయం మన రోజంతా ఎలా సాగబోతుందో నిర్ణయించే కీలక సమయం. రోజును ప్రశాంతంగా, సానుకూల ఆలోచనలతో ప్రారంభిస్తే మనసుకు ఉత్సాహం, శరీరానికి శక్తి, పనిలో ఏకాగ్రత పెరుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రం, భారతీయ సంప్రదాయాల్లో కూడా ఉదయపు వేళ పాటించాల్సిన కొన్ని సులభమైన అలవాట్లను పేర్కొన్నారు. ఇవి పెద్దగా సమయం తీసుకోవు. అయితే వాటిని నిత్యజీవితంలో భాగం చేసుకుంటే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం….

Read Full News

తమిళ సినిమా కోసం.. లైఫ్ ని రిస్క్ లో పెట్టాడు.. | Suhas Risks His Life for Tamil Film Mandadi: Actor Reveals Shocking 45 Day Sea Shoot and Near Fatal Accidents video tv9d – Entertainment Videos in Telugu

తమిళ సినిమా కోసం సుహాస్ లైఫ్‌ ని రిస్క్‌లో పెడుతున్నాడా..! (వైఫ్) షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా, విలన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు సుహాస్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగాడు సుహాస్. ఇన్నాళ్లు తెలుగు సినిమాలతో మెప్పించిన సుహాస్ ఇప్పుడు తమిళ్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. తమిళ్ స్టార్ కమెడియన్ సూరి హీరోగా చేస్తున్న మండాడి సినిమాలో సుహాస్ మెయిన్…

Read Full News

భూమి నుంచి నేరుగా అంతరిక్షానికి లిఫ్ట్‌.. త్వరలో నిజం కానుందా? | Space Elevator: Scientists Explore a 66,000 Mile Cable That Could Take Humans to Space Without Rockets video tv9d – Technology Videos in Telugu

భవిష్యత్తులో రాకెట్ల అవసరం లేకుండానే నేరుగా అంతరిక్షానికి వెళ్లేలా ‘స్పేస్‌ ఎలివేటర్‌’ నిర్మించే దిశగా శాస్త్రవేత్తలు కీలక అడుగులు వేస్తున్నారు. భూమధ్యరేఖ సమీపంలో భూమి నుంచి భూస్థిర కక్ష్యను దాటి దాదాపు 66 వేల మైళ్ల పొడవున ఈ కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా మనుషులు, సరకులను ఎలాంటి రాకెట్ల ప్రమేయం లేకుండానే సులువుగా అంతరిక్షానికి తరలించవచ్చు. అయితే దీని నిర్మాణానికి ఉక్కు కంటే వంద రెట్లు బలంగా, తేలికగా ఉండే పదార్థం అవసరం. అయితే,…

Read Full News

బరువు తగ్గడానికి తేనె, గోరువెచ్చని నీరు.. ఈ ఉదయపు అలవాటు నిజంగా పనిచేస్తుందా? | Honey Water for Weight Loss: Does Drinking Warm Water With Honey Really Burn Belly Fat Here’s the Truth video tv9d

ఉదయాన్నే నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం చాలామందికి అలవాటు. ఉదయాన్నే ఈ పానీయం సేవించడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సాంప్రదాయ ఆరోగ్య పద్ధతి వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు ఏమిటో పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది శరీరంలోని కొవ్వును ఇట్టే కరిగిస్తుందని, జీవక్రియను వేగవంతం చేస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు. కానీ, పోషకాహార నిపుణులు, శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం…

Read Full News

నా సినిమాలో సన్నివేశాన్ని వాడుకున్నారు.. కానీ ఆయన కన్నా ఆ సీన్ నేనే బాగా తీశా.. | V.N. Aditya on Manasu Maata Vinadu Scene and AR Murugadosss Stalin

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తన సినీ ప్రయాణంలోని లోతైన అంశాలను, వ్యక్తిగత ఆలోచనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా, తన దర్శకత్వంలో వచ్చిన మనసు మాట వినదు చిత్రంలోని ఒక సీక్వెన్స్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన స్టాలిన్ సినిమాలో కనిపించిన ఒక సన్నివేశానికి ప్రేరణగా నిలిచిందని ఆయన వెల్లడించారు. మనసు మాట వినదు చిత్రంలో నటించిన నాగబాబు గారు ఈ విషయాన్ని తనను అడిగి ధృవీకరించారని, అయితే స్టాలిన్ చూసిన తర్వాత కూడా తాను రూపొందించిన…

Read Full News

మెడికల్ మిరాకిల్! వ్యక్తికి పంది కిడ్నీ అమర్చగా.. ఫస్ట్ టైమ్ 9 నెలలు పని చేసింది ..!! | Man given genetically modified pig kidney for nine months in world first

అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూకి రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. వాటిని తొలగించి కొత్త కిడ్నీ అమర్చాలని డాక్టర్లు సూచించారు. ఆయన కుటుంబ సభ్యులు డోనర్ కోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, ఎవరూ దొరకలేదు. ఈ నేపథ్యంలో వైద్యులు అతనికి జన్యుపరంగా మార్పు చేసిన (జెనటికల్లీ ఎడిటెడ్) పంది కిడ్నీని అమర్చారు.  ఈ సర్జరీ 2025 జనవరిలో జరిగింది. ఆండ్రూ పంది కిడ్నీ సహాయంతో, డయాలసిస్ అవసరం లేకుండా 9 నెలలు గడిపాడు. ఆ తర్వాత…

Read Full News

ఆయన నాకు ఇంటి దేవుడు.. నా కుటుంబాన్ని నిలబెట్టిన దైవం | Actress Sri Lakshmi Remembers Director Jandhyala, Comedy Career and Telugu Film Evolution

ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ నటి శ్రీలక్ష్మి తన సినీ ప్రస్థానాన్ని, దివంగత దర్శకులు జంధ్యాల, కే. విశ్వనాథ్ వంటి దిగ్గజాలతో తన అనుభవాలను, తెలుగు సినిమా రంగంలో వచ్చిన మార్పులను వివరంగా పంచుకున్నారు. జంధ్యాల గారితో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీలక్ష్మి తనను ఒక కామెడీ నటిగా నిలబెట్టిన ఘనత పూర్తిగా దర్శకుడు జంధ్యాల గారిదేనని పేర్కొన్నారు. నీకు కామెడీ రాదు” అని ఒకరు అన్నప్పుడు, జంధ్యాల గారు నేను చేయిస్తాను చూడు, నువ్వు…

Read Full News

Telangana: ఛీ.. ఛీ ఇలాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదు.. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. | Man Beats Mother to Death Over Liquor Money in Suryapet; Accused Absconding

తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న కొడుకే తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ సైదాబీ అనే మహిళకు షేక్ సుభాని అనే కుమారుడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కొడుకుని కష్టపడి పెంచిన సైదాబీ, కొన్నేళ్ల క్రితమే అతనికి పెళ్లి కూడా చేసింది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే సుభాని తాగుడుకి బానిస అవ్వడంతో ఏడాది క్రితమే అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. దీంతో…

Read Full News

దోమల బెడదతో విసిగిపోయారా? ఇంట్లోనే ఈ సహజ చిట్కాలతో దోమలను తరిమేయండి! | Mosquito Control: Try These Natural Ways to Keep Mosquitoes Away at Home

Mosquito Control Tips Telugu: వర్షాకాలంలో దోమల బెడద మరింత పెరుగుతుంది. ఇంటి తలుపులు, కిటికీలు తెరిచిన వెంటనే దోమలు లోపలికి చేరి ఇబ్బంది పెడుతుంటాయి. వాటి కాటుతో దురద, చర్మంపై దద్దుర్లు రావడమే కాకుండా, కొన్ని దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో చాలామంది మస్కిటో కాయిల్స్, లిక్విడ్ రిపెల్లెంట్స్, స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిపై పూర్తిగా ఆధారపడకుండా, దోమలను నియంత్రించేందుకు కొన్ని సహజ పద్ధతులను…

Read Full News

అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అత్తాపూర్‌ ప్రాంతానికి చెందిన నహీద్ కౌసర్ అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ఎస్సై రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నహీద్ కౌసర్ అదే ప్రాంతానికి చెందిన ఫర్వేజ్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ కలసి జీవించడమే కాకుండా ఉమ్మడిగా హ్యాండ్‌బ్యాగుల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళిక వేశారు. అందులో భాగంగా…

Read Full News