Headlines

Tollywood: ఈ టాలీవుడ్ డైరెక్టర్ చాలా గ్రేట్.. ఆఫీస్‌లో లంచ్ టైమ్‌కి ఎంత మంది ఉన్నా భోజనం చేయాల్సిందే | Did You Know Tollywood Director Trinadha Rao Nakkina Provides Lunch In His Office, Details Here

Tollywood: ఈ టాలీవుడ్ డైరెక్టర్ చాలా గ్రేట్.. ఆఫీస్‌లో లంచ్ టైమ్‌కి ఎంత మంది ఉన్నా భోజనం చేయాల్సిందే | Did You Know Tollywood Director Trinadha Rao Nakkina Provides Lunch In His Office, Details Here


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న చాలా మంది గతంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడినవారే. పొట్టకూటి కోసం పడరాని పాట్లు పడరానివారే. ఒకప్పుడు గంజి నీళ్లతో ఆకలి తీర్చుకున్న వాళ్లు మన సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాలీవుడ్ డైరెక్టర్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. అయితే ఆ సమయంలో తినడానికి తిండి కూడా దొరక్కపోవడంతో చాలా సార్లు గంజి నీళ్లతోనే ఆకలి తీర్చుకున్నాడు. ఇంకొన్ని సార్లు గుళ్లోకి వెళ్లి అక్కడిచ్చే ప్రసాదంతో పొట్టి నింపుకొన్నాడు. అలాగే దొంగచాటుగా పెళ్లళ్లు, ఫంక్షన్లకు వెళ్లి తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఆకలి విలువ బాగా తెలుసు కాబట్టే ఈ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఇప్పుడు తన ఆఫీస్ లో ఒక రూల్ పెట్టాడు. లంచ్ టైమ్ లా తన ఆఫీస్ లో ఎంత మంది ఉన్నా భోజనాలు తిని వెళ్లాల్సిందే. అలాగే ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్లు రూమ్స్ లేక ఇబ్బంది పడుతుంటే తన ఆఫీసులోనే పడుకునేలా సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. దీంతో ఈ టాలీవుడ్ డైరెక్టర్ గొప్ప మనసుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆయనెవరనుకుంటున్నారా. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన త్రినాథరావు నక్కిన.

విశాఖపట్నంకు చెందిన త్రినాథ రావు నక్కిన అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత మేం వయసుకు వచ్చాం సినిమాతో డైరెక్టర్ గా హిట్అందుకున్నాడు. సినిమా చూపిస్త మావా, నేను లోకల్, హలోగురు ప్రేమ కోసమే, ధమాకా, మజాకా వంటి సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు త్రినాథరావు. కైవలం డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటుతున్నారాయన. గతంలో చౌర్యపాఠం అనే ఓ డిఫరెంట్ సినిమాను నిర్మించి ప్రశంసలు అందుకున్నారు త్రినాథరావు. ఇప్పుడు అనకాపల్లి అనే ఓ సినిమాను నిర్మించి తెలుగు ఆడియెన్స కు అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారీ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి



బ్రహ్మానందంతో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *