Headlines

తిరుమలలో వింత.. నీళ్ల కోసం కొళాయి తెరిస్తే పాలు వస్తున్నాయి! టెస్ట్ చేయించి నిజం తేల్చిన టీటీడీ | Why Is Water Turning White at Tirumala Japali Theertham? TTD Explains the Real Reason

తిరుమలలో వింత.. నీళ్ల కోసం కొళాయి తెరిస్తే పాలు వస్తున్నాయి! టెస్ట్ చేయించి నిజం తేల్చిన టీటీడీ | Why Is Water Turning White at Tirumala Japali Theertham? TTD Explains the Real Reason


శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు కొందరు కొండపై పలు ప్రాంతాలకు వెళ్తారు. పాప నాశనం ఆకాశగంగ, శిలాతోరణం, శ్రీవారి పాదాలు జపాలి ఇలా పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఇలా జపాలి తీర్థానికి వెళుతున్న భక్తులకు ఇప్పుడు కొత్త అనుభూతి ఎదురవుతోంది. జపాలి తీర్థం వద్ద కుళాయిల్లో తాగునీరు తెల్లగా పాలవలె కనిపిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న తాగునీటి కొళాయిల్లో ధవళ వర్ణంలో తాగునీరు వస్తుండడం భక్తుల్లో కొత్త అనుభూతి వ్యక్తం అవుతుంది.

కుళాయిల నుంచి వచ్చే తెల్ల రంగులో నీటిని పట్టుకుని తాగుతున్న భక్తులు ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో జపాలి తీర్థం వద్ద కొళాయిలలో వస్తున్న నీరు తెల్లని పాలవలె ఉండడంతో భక్తులు మరింత భక్తి భావాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది మహత్యమా లేక మరేదైనా కారణమా అన్న కోణంలోనూ ఆలోచిస్తున్నారు కుళాయిలో నీరు ఫోర్సు గా వచ్చే క్రమంలో తెల్లగా రావడం మామూలే. కొన్ని సెకండ్ల తర్వాత సహజ స్థితికి చేరుకొని పారదర్శకంగా మారడం అందరికీ తెలిసిందే. అధిక ఒత్తిడి కారణంగానే గాలి బుడగలు నీటిలో ఏర్పడడం ద్వారా నీరు తెల్లగా కనిపిస్తుందా లేదంటే జపాలి తీర్థంలో ఏదైనా స్వామి వారి మహత్యం ఉందా అని భక్తులు పెద్ద ఎత్తున తెల్లగా వస్తున్న నీటిని వైరల్ చేసి చర్చగా మార్చారు. దీంతో టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ ఎనాలసిస్ లాబ్ కు నీటి నమూనాలను పంపిన టిటిడి ఆరోగ్య విభాగం మేరకు పరీక్షించి నీరు పూర్తిగా స్వచ్ఛమైనవేనని తేల్చింది. చక్కర్లు కొడుతున్న అసత్య ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.

అపోహలు వద్దు..

జపాలి వద్ద నీరు తెల్లగా కనిపించడంపై అపోహలు వద్ద టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. వాటర్ ప్రెజర్ వల్ల ఏర్పడే సూక్ష్మ గాలి బుడగల కారణంగానే తెల్లగా నీరు కనిపిస్తుందని స్పష్టం చేస్తుంది. టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్ పరీక్షల్లో నీరు స్వచ్ఛమైనవిగా నిర్ధారణ అయ్యిందని ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ వివరణ ఇచ్చింది. వీడియోలో కనిపించినట్లుగా కొళాయిలో నుంచి వచ్చిన నీరు కొన్ని సెకన్లలోనే సహజ స్థితికి చేరుకుని పారదర్శకంగా మారుతోందని చెబుతోంది. అధిక వాటర్ ప్రెజర్ కారణమని నీటిలో సూక్ష్మ గాలి బుడగలు ఏర్పడటం వల్ల నీరు తాత్కాలికంగా తెల్లగా కనిపిస్తోందని నిపుణుల అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. తిరుమలలోని టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్‌లో పరీక్షించగా, నీరు పూర్తిగా స్వచ్ఛమైనదేనని నిర్ధారణ అయింది. నీటిలో ఎలాంటి దుర్వాసన, అడుగున అవశేషాలు (సెడిమెంట్) ఇతర మలినాలు లేవని ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్ నిపుణులు తెలిపినట్లు ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అసత్య సమాచారాన్ని నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *