Headlines

Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే.. | Cat vs King Cobra: Viral Video Leaves Netizens Stunned

Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే.. | Cat vs King Cobra: Viral Video Leaves Netizens Stunned


సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా పాము, ముంగిసల మధ్య హోరాహోరీ పోరు జరగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఎప్పుడైనా కింగ్ కోబ్రాతో ఓ చిన్న పిల్లి ముఖాముఖి తలపడటం చూశారా? వినడానికే కాస్త వింతగా అనిపించినా.. తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తనను కాటు వేయడానికి విరుచుకుపడిన విష సర్పానికి పిల్లి చుక్కలు చూపించిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

భయపడటం పక్కనబెట్టి.. ఎదురుదాడికి..

ఘర్ కే కలేష్ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఒక బహిరంగ ప్రదేశంలో కింగ్ కోబ్రా, పిల్లి ముఖాముఖి ఎదురవుతాయి. పిల్లిని చూడగానే కింగ్ కోబ్రా తన పడగ విప్పి, భయపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. సాధారణంగా అంత పెద్ద విషసర్పం కనిపిస్తే ఏ జీవి అయినా పరుగులు తీస్తుంది. కానీ ఆ పిల్లి మాత్రం ఎక్కడా భయపడకుండా చాలా ప్రశాంతంగా, ధైర్యంగా పాము ముందే కూర్చుండిపోయింది. కింగ్ కోబ్రా ఒక్కసారిగా పిల్లిపై దాడి చేయడానికి ముందుకు రాగా, పిల్లి మెరుపు వేగంతో ఆ కాటు నుంచి తప్పించుకుంది. అంతటితో ఆగకుండా తన పంజాతో పాముపై ఎదురుదాడి చేస్తూ దాన్నే బెదిరించడం మొదలుపెట్టింది. పిల్లి ధైర్యానికి ఆ విష సర్పమే తోకముడిచి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.

నెటిజన్ల ఫన్నీ కామెంట్లు – వైరల్ వీడియో..

ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఇప్పటికే ఈ వీడియోను 48 వేలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ క్లిప్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పాము కంటే పిల్లి రిఫ్లెక్సెస్ చాలా ఎక్కువ అని ఈ వీడియో నిరూపించింది. అని ఒకరు కామెంట్ చేయగా.. ఏ పరిస్థితిలోనూ పిల్లిని తేలికగా తీసుకోకూడదురా బాబోయ్ అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. విషసర్పంతో ఆడుకోవడానికి పిల్లికి ఎంత ధైర్యం ఉండాలి అంటూ పిల్లి చాకచక్యాన్ని కొనియాడారు. స్తుతం ఈ ఫన్నీ అండ్ థ్రిల్లింగ్ వీడియో నెట్టింట విపరీతంగా సందడి చేస్తోంది.

వీడియో చూడండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *