Headlines

cwcuppal@gmail.com

వెలుగులోకి దారుణం.. తల్లిని చంపి.. అన్నకు ఫోటో పంపిన తమ్ముడు..!

తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు తన తల్లిని రోలుతో తలపై కొట్టి హతమార్చాడు. ఈ దారుణ ఘటన తూత్తుకుడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తిరుచెందూర్ సమీపంలోని కుమారపురం జయనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని రిటైర్డ్ కళాశాల ప్రొఫెసర్ రేణుకాదేవి (62)గా గుర్తించారు. నిందితుడైన ఆమె కుమారుడు తంగపాలన్ (27)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుకాదేవి, అంబుమణి దంపతులకు ఇద్దరు…

Read Full News

ఆ ఒక్క హీరోతో 12 సినిమాలు చేస్తే పది హిట్ అయ్యాయి.. ఆసక్తికర విషయం చెప్పిన రాఘవేంద్రరావు | Raghavendra rao Intresting comments about sr NTR and his Movies

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకయ్యనాయుడు వంటి ప్రముఖులు కూడా ఆయన సినిమాలు “స్వర్గాన్ని నేలమీదకు దించినట్టు” ఉంటాయని ప్రశంసించారు. ఒక హీరోయిన్‌ను ఇంత అందంగా మరే దర్శకుడు చూపించలేదని, హీరోయిన్ ఎంట్రీ షాట్‌లు పూల మధ్యలో చూపించడం తన ప్రత్యేకత అని వ్యాఖ్యాత అన్నారు. తన కెరీర్ తొలినాళ్లలో “జ్యోతి”, “ఆమె కథ”, “అమరదీపం” వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో విజయం సాధించారు రాఘవేంద్రరావు. ఈ చిత్రాల తర్వాత ఇలాంటి…

Read Full News

Hyderabad: మెకానిక్ టు అక్రమ భవనాల బిల్డర్.. గచ్చిబౌలి భవనం కూలిన ఘటనలో సాజిద్ ఖాన్ అరెస్ట్.. | Hyderabad Gachibowli Building Collapse: Builder Sajid Khan Arrested, Town Planning Officer Suspended

హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భారీ భవనం కుప్పకూలిన దుర్ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై అధికార యంత్రాంగం వేగంగా స్పందించి కఠిన చర్యలు ప్రారంభించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి, నిబంధనలకు విరుద్ధంగా సాగిన అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోనందుకు మాదాపూర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి సంతోష్‌కుమార్‌ను సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఘటనకు బాధ్యుడైన బిల్డర్ సాజిద్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అనుమతులకు…

Read Full News

స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ! కీలక అంశాలపై చర్చ | PM Modi Meets 20 Space Startup CEOs, Pushes Private Sector Growth and Wider Use of Space Technology

దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింత పెంచడంతో పాటు స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలు, వ్యవస్థాపకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని సేవా తీర్థలో జరిగిన ఈ భేటీలో అంతరిక్ష సాంకేతికత వినియోగాన్ని మరిన్ని రంగాలకు విస్తరించడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం వంటి అంశాలపై చర్చించారు. ప్రైవేట్ రంగానికి పెరుగుతున్న అవకాశాలు భారత అంతరిక్ష రంగంలో…

Read Full News

పెరుగు ఎలా తోడు పెట్టినా పుల్లగా అవుతుందా..? తియ్యగా, కమ్మగా కావాలంటే ఇలా చేయండి.. | Is Your Homemade Curd Turning Sour Too Quickly? Here’s the Right Way to Set Thick and Creamy Yogurt

రోజువారీ ఆహారంలో పెరుగు భాగం కావడం మన భారతీయుల సాంప్రదాయం. అయితే చాలామంది ఎదుర్కొనే ఒక ప్రధాన సమస్య ఏమిటంటే.. రాత్రి తోడుపెట్టిన పెరుగు ఉదయానికి గడ్డలా కాకుండా బాగా పుల్లగా మారిపోవడం. ఇంట్లో తోడుపెట్టిన పెరుగు రాత్రికి రాత్రే పుల్లగా మారడానికి ప్రధాన కారణం ఓవర్ ఫర్మెంటేషన్ అంటే అతిగా పులవడమే. దీనికి కారణం ఏంటి..? సమస్యకు పరిష్కారం ఏంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. పెరుగు ఎందుకు పుల్లగా మారుతుంది?: పాలు పెరుగుగా మారడానికి…

Read Full News

AUS VS BAN: ఆస్ట్రేలియా వెళ్లి.. వాళ్లకే చుక్కలు చూపించాడు! చరిత్ర సృష్టించిన బంగ్లా బౌలర్! | Shoriful islam 7 wickets australia test record bangladesh cricket

AUS VS BAN: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ యంగ్ పేసర్ షోర్ఫుల్ ఇస్లామ్ అద్భుతమైన ప్రదర్శనతో సంచలనం సృష్టించారు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను ఒంటిచేత్తో కుప్పకూల్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బంగ్లా బౌలర్‌గా రికార్డులకెక్కారు. మ్యాకే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో షోర్ఫుల్ ఇస్లామ్ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో విరుచుకుపడ్డారు. కేవలం 15 ఓవర్లలో 48…

Read Full News

విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. | Big Relief for International Passengers: Bureau of Immigration To Stops Boarding Pass Stamps From September 1

భారత్ నుంచి విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేసేందుకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో బోర్డింగ్ పాస్‌లపై స్టాంప్ వేసే విధానాన్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. నూతన నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు ఇకపై పేపర్ బోర్డింగ్ పాస్‌లను మాత్రమే వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తమ స్మార్ట్‌ఫోన్‌లలోని…

Read Full News

Toxic Pre Release Event : టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. కిందపడిన భారీ సౌండ్ సెట్.. విద్యార్థులకు గాయలు.. | Two Students Injured At Rocking Star Yash Toxic Movie Pre Released Event Malla Reddy University In Hyderebad

పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ దులపల్లి లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి…

Read Full News

అమెరికా ఆర్థిక యుద్ధంలో చేరితే శత్రువులే.. ప్రపంచ దేశాలకు ఇరాన్‌ వార్నింగ్..! | US Economic War: Iran Threatens Global Retaliation, Escalates Tensions

ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై అమెరికా చేపడుతున్న ఆర్థిక ఒత్తిడి, ఆంక్షల కార్యక్రమంలో ఏ దేశమైనా భాగస్వామి అయితే.. తమ దృష్టిలో ఆ దేశం శత్రువేనని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి మొహ్సెన్‌ రెజాయీ శనివారం (ఆగస్టు 22)ప్రభుత్వ టెలివిజన్‌లో ఈ హెచ్చరికలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను ఒంటరిచేసేందుకు కొత్తగా భారీ ఆంక్షల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇరాన్‌తో వాణిజ్యం,…

Read Full News

IND vs SL 2nd Test: గిల్ సేనకు గెలుపు జోష్.. లంకకు గాయాల షాక్.. కొలంబో టెస్టులో వర్షం ఎవరి కొంప ముంచుతుంది? | Ind vs sl 2nd test colombo weather ssc pitch report

IND vs SL 2nd Test: గాలే టెస్టులో లంకను చిత్తు చేసిన భారత క్రికెట్ జట్టు, ఇప్పుడు రెందో టెస్టులోనూ విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ఆగస్టు 23 ఆదివారం నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో ఈ ఆఖరి పోరు ప్రారంభం కానుంది. వాతావరణం, పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి టెస్టులో 165 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించిన శుభ్‌మన్ గిల్…

Read Full News