ఓటమితోనే 94 ఏళ్ల హిస్టరీ మొదలు.. కట్‌చేస్తే.. 30 ఏళ్లుగా టీమిండియా దూకుడు చూస్తే షివరింగే..! | India 600th test match history results milestones
India Test Match History: భారత్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను 1932లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో ఆడింది. స్వాతంత్ర్యానికి ముందే మొదలైన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 158 పరుగుల తేడాతో విజయం సాధించింది. 100వ టెస్టు కూడా ఇంగ్లండ్‌తోనే జరిగింది. 1967లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 132 పరుగులతో భారత్‌ను ఓడించింది. దీంతో తొలి రెండు మైలురాళ్ల టెస్టుల్లోనూ టీమిండియాకు పరాజయాలే ఎదురయ్యాయి. 200వ టెస్టులో డ్రా.. 300వ మ్యాచ్‌లో విజయం 1982లో…