9 రోజుల పాటు చీకటిలోనే.. చివరకు ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు.. నేపాల్‌లో అద్భుతం! | Miracle In Nepal: Two workers Rescued Alive After Nine Days from Hydropower Tunnel
ఖాట్మండు: ఊహించని ప్రకృతి విపత్తు.. చుట్టూ ఎటుచూసినా మట్టి, బండరాళ్లు.. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి.. అయినా ప్రాణాలపై ఆశ వదులుకోలేదు. చివరకు దాదాపు తొమ్మిది రోజుల తర్వాత సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటపడటంతో నేపాల్‌లో అద్భుత ఘటన చోటుచేసుకుంది. రసువా జిల్లాలోని అప్పర్ త్రిశూలి-3A జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరిని శుక్రవారం (సెప్టెంబర్ 04) నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. రక్షించిన వారిని…