Success Story: టైలర్ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల AI ఇంజినీర్ ఉద్యోగం | Hard Work Pays Off: Tailor’s Son Lands Rs 1.06 Crore AI Engineer Job in Canada, Inspires Youth
కాకినాడ, జులై 28: ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉన్నా కష్టపడి చదివితే విజయాన్ని అందుకోవచ్చని తాజాగా మరోమారు రుజువైంది. టైలర్‌గా పనిచేస్తున్న తండ్రి కష్టాలను చూసి పెరిగిన ఓ యువకుడు ఇప్పుడు కెనడాలో ఏడాదికి రూ.1.06 కోట్ల వేతనంతో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి అఖిలేశ్.. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అఖిలేశ్ తండ్రి…