ఉద్యోగుల్లో తగ్గుతున్న ‘ఎక్స్‌ట్రా ఎఫర్ట్’.. Gen Z పుణ్యమాని వర్క్ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్..!
హైదరాబాద్, జులై 28: ముఖ్యంగా యువ ఉద్యోగులు పనిపై తమ దృక్పథాన్ని మార్చుకుంటుండగా, కృత్రిమ మేధస్సు (AI) ఉద్యోగ ప్రపంచాన్ని వేగంగా ప్రభావితం చేస్తోంది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా 2026 తాజా అధ్యయనం ప్రకారం భారతీయ సంస్థల్లో ‘ఎఫర్ట్ రిసెషన్ (Effort Recession)’ అనే కొత్త ధోరణి కనిపిస్తోంది. అంటే ఉద్యోగులు తమ విధుల్లో భాగం కాని అదనపు బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకోవడానికి ఆసక్తి చూపడం తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. జాబ్ సెక్టార్‌లో పెరుగుతున్న…