బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
వర్షాకాలం మొదలయ్యాక ఫస్ట్ టైం ఏపీ, తెలంగాణలో ఒకేరోజు భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా భారీవర్షం కురుస్తోంది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ ప్రజలు ఉరుముల సౌండ్ విన్నారు. మొత్తానికి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం (29-07-2026) అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు…