Headlines

దేవుడి దయ అంటే ఇదేనేమో.. మృత్యువుకు 100 మీటర్ల దూరంలో ఏపీ వాసులు.. నేపాల్ వరదల్లో ఎలా బతికారంటే..? | Miracle in Nepal Floods: How a Short Tea Break Saved 26 Pilgrims from Andhra Pradesh

భగవంతుడు కాపాడాలని అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు అనే నానుడి నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ భక్తుల విషయంలో అక్షరాలా నిజమైంది. నేపాల్‌లో ముంచెత్తిన భీకర జలప్రళయంలో కేవలం 100 మీటర్ల దూరం నుంచి మృత్యుంజయులుగా బయటపడ్డారు తిరుపతికి చెందిన 26 మంది యాత్రికులు. స్థానికుల అప్రమత్తత, బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో పాటు వాళ్లు ఆగిన ఒక చిన్న టీ బ్రేక్ 26 నిండు ప్రాణాలను కాపాడింది. కైలాస మానససరోవర్ యాత్ర నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి…

Read Full News

ఇదే ప్రపంచపు అసలైన అరటిపండు..కానీ, దీని సంకర రకాన్ని మార్కెట్లో అమ్ముతారు! | Wild Bananas vs. Store Bought Bananas: Did You Know Real Bananas Have Hard Seeds?

మనం నిత్యం తినే పండ్లలో అరటిపండు అత్యంత ప్రజాదరణ పొందినది. సాధారణంగా అరటిపండు తొక్క తీసి చూడగానే అందులో విత్తనాలు ఉండకపోవడం మనం గమనిస్తుంటాం. అయితే, ప్రకృతి సిద్ధంగా దట్టమైన అడవుల్లో పెరిగే అసలైన అరటిపండులో గట్టి విత్తనాలు ఉంటాయని మీకు తెలుసా? మనం మార్కెట్లో కొనుగోలు చేసే అరటిపండ్లు సహజసిద్ధమైనవి కావు, అవి మానవులు అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకాలు. అసలైన అడవి అరటిపండు: దట్టమైన వర్షారణ్యాల్లో పెరిగే అసలైన అరటి జాతులను మూసా అక్యుమినేటా,…

Read Full News

IND vs NZ: లంక ఎఫెక్ట్.. కీవిస్‌తో సిరీస్ నుంచి ఐదుగురు ఔట్.. ఇకపై ఎంట్రీ కష్టమే..? | Indian cricket team new zealand tour test squad selection challenges 2024

India vs New Zealand Test Series: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ను 1-0తో గెలుచుకున్న టీమిండియా, ఇప్పుడు రాబోయే న్యూజిలాండ్ పర్యటనపై దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ 19న వెల్లింగ్టన్‌లో తొలి టెస్ట్, అలాగే నవంబర్ 27న క్రైస్ట్ చర్చ్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ పరిస్థితులు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో (డబ్ల్యూటీసీ) భారత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని…

Read Full News

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రూట్ ఫిక్స్.. తక్కువ ధరలో వందే భారత్ తరహా ప్రయాణం.. | New Amrit Bharat Express for Telugu States: Dhanbad Coimbatore Weekly Train Announced

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ రైళ్లు సదూర ప్రాంతాలకు వెళ్తుండగా.. ఇప్పుడు మరో రైలును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ట్రైన్‌కు సంబంధించి టైమ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో ప్రయోజనం చేకూరనుంది. ధన్ బాద్-కోయంబత్తూర్-ధన్ బాద్ మధ్య…

Read Full News

అవును.. ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..! భలే ఉండేది క్యూట్‌గా.. | Do you know How Sudheer Babu Prema Katha Chitram heroine Nanditha Raj looks like now

సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. 2013 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నందిత రాజ్ నటించింది. సప్తగిరి, ప్రవీణ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన కామెడీ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. అలాగే హీరోయిన్ నందిత తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. గ్లామర్…

Read Full News

ఆ సినిమా దెబ్బకు మొత్తం పోగొట్టుకున్నాం.. చివరకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. | Actor Raghu Babu on financial difficulties his father faced

ప్రముఖ నటుడు రఘుబాబు తన కుటుంబ సినీ ప్రస్థానంలో, ముఖ్యంగా తన తండ్రి గిరిబాబు నిర్మాతగా ఎదుర్కొన్న ఆర్థిక పోరాటాలు,  త్యాగాలను వివరించారు. నటులు నిర్మాతలు అవ్వడం సర్వసాధారణమే కానీ, నిర్మాతలు నటులు కావడం చాలా అరుదైన విషయమని, ఇది తన కుటుంబంలో ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిందని రఘుబాబు అన్నారు. గిరిబాబు మొదటి నుంచీ ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని రఘుబాబు గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారితో గిరిబాబుకు చాలా…

Read Full News

ప్రపంచాన్ని ఏకం చేసేది కృష్ణ చైతన్యమే.. న్యూయార్క్‌ ఇస్కాన్ ఆలయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూజలు | Krishna Consciousness Can Unite Divided World, RSS Chief Mohan Bhagwat Visits New York ISKCON

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అమెరికా పర్యటనలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్‌లోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నిరాశ్రయులకు ఆహార పంపిణీ చేసే సేవా కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నేటి సమాజంలో విభేదాలు, వైరుధ్యాలు పెరిగిపోతున్న తరుణంలో కృష్ణ చైతన్యమే ప్రపంచాన్ని ఏకం చేయగలదని మోహన్ భగవత్ తెలిపారు. ‘‘ప్రస్తుత ప్రపంచంలో అనేక రకాల…

Read Full News

ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా..? ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ కోసమే! | Black Raisins Benefits: Eat 10–15 Soaked Raisins Every Morning for These Amazing Health Benefits

ప్రతిరోజూ ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వీటిలో ఐరన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రాత్రంతా నానబెట్టిన నల్ల కిస్‌మిస్‌ను పరగడుపున తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడటం, శరీరానికి తక్షణ శక్తి లభించడం వంటి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా గుండె, మెదడు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ 10 నుండి…

Read Full News

Toxic OTT: డివైడ్ టాక్ దెబ్బకు డీల్ సెట్..! ఓటీటీలోకి టాక్సిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే | There is a lot of buzz circulating on social media regarding the OTT release of the movie ‘Toxic’.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ సినిమా టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ సినిమా ఊహించని విధంగా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాలు, బీభత్సంమైన ప్రమోషన్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. దాంతో ఆడియన్స్ ఈ సినిమాపై బోలెడన్ని హోప్స్ పెట్టుకున్నారు. తీరా థియేటర్స్ కు వెళ్లిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. సినిమా చూసిన ఆడియన్స్ చాలా మంది…

Read Full News

చేపలు కాదు.. ప్లాస్టిక్ తింటున్నాం! అధ్యయనంలో బయటపడ్డ భయంకర నిజాలు

విశాఖ తీరంలో పట్టిన కొన్ని చేపల్లో మైక్రోప్లాస్టిక్‌ కణాలు ఉన్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. ఇవి ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో లేనప్పటికీ.. చేపల జీర్ణాశయానికే పరిమితం కాకుండా మొప్పలు, కణజాలాల్లోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర కాలుష్యం ఏ స్థాయికి చేరిందో ఈ పరిశోధన సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. నెత్తళ్లు, సావిడాయిలపై పరిశోధన ఆంధ్ర విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ మంజులత నేతృత్వంలో జి. చంద్రిక ఈ అధ్యయనం చేపట్టారు. విశాఖ హార్బర్‌కు సముద్రం నుంచి…

Read Full News