చేపలు కాదు.. ప్లాస్టిక్ తింటున్నాం! అధ్యయనంలో బయటపడ్డ భయంకర నిజాలు
విశాఖ తీరంలో పట్టిన కొన్ని చేపల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. ఇవి ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో లేనప్పటికీ.. చేపల జీర్ణాశయానికే పరిమితం కాకుండా మొప్పలు, కణజాలాల్లోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర కాలుష్యం ఏ స్థాయికి చేరిందో ఈ పరిశోధన సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. నెత్తళ్లు, సావిడాయిలపై పరిశోధన ఆంధ్ర విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మంజులత నేతృత్వంలో జి. చంద్రిక ఈ అధ్యయనం చేపట్టారు. విశాఖ హార్బర్‌కు సముద్రం నుంచి…