TET పాసైన వారికి గుడ్‌న్యూస్.. MeeSeva కేంద్రాల ద్వారా ప్రింటెడ్ సర్టిఫికెట్లు జారీ! | Telangana TET Qualified Candidates Since 2011 to Get Printed Memos Through MeeSeva Centres
హైదరాబాద్, ఆగస్ట్ 18: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2011 నుంచి ఇప్పటివరకు TETలో అర్హత సాధించిన వారందరికీ మీ సేవ కేంద్రాల ద్వారా ముద్రిత మెమోలను జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రింటెడ్ మెమోపై ప్రత్యేకమైన బార్‌కోడ్‌తో పాటు సర్టిఫికెట్ నంబర్ కూడా ఉంటుంది. అభ్యర్థి పేరు, ఫొటో, వేలిముద్ర లేదంటే సంతకం,…