Gutti Tomato Curry: ఇంట్లో టమాటాలు ఎక్కువగా ఉన్నాయా ?? ఇలా గుత్తి మసాలా కర్రీ చేయండి
రోటీ, చపాతీ, పుల్కా, పూరీ లేదా బగారా రైస్, బిర్యానీలోకి ఈ మసాలా గ్రేవీ కర్రీ అమృతతుల్యమైన కాంబినేషన్‌గా నిలుస్తుంది. 'అమ్మ చేతి వంట' శైలిలో పక్కా కొలతలతో ఈ కర్రీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ గుత్తి టమాటా మసాలా కర్రీ తయారీకి ముందుగా ఒక పావు కేజీ చిన్న సైజు నాటు టమాటాలను శుభ్రంగా కడిగి తొడిమెలు తీసి, విడిపోకుండా నాలుగు గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా…