Veg Manchurian: పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా.. సీక్రెట్ టిప్‌తో గంటల తర్వాత కూడా సాఫ్ట్‌గా ఉండేలా ఇలా చేయండి
అయితే ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రిడియంట్‌ను ఉపయోగించి, పక్కా కొలతలతో చేస్తే గంటల తర్వాత కూడా అంతే మెత్తగా, జ్యూసీగా ఉండే పర్‌ఫెక్ట్ మంచూరియాను ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఈ వెజ్ మంచూరియా తయారీ కోసం ముందుగా ఒక కాటన్ గుడ్డలో 120 గ్రాముల క్యారెట్ తురుము, అర కప్పు క్యాబేజీ తురుము వేసి మూటలా చుట్టి ఎంత వీలైతే అంత గట్టిగా పిండి నీటిని పూర్తిగా తొలగించాలి. పిండిన క్యాబేజీ-క్యారెట్ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని…