Telangana: ప్రాణహిత, గోదావరి మహోగ్రరూపం.. నిండుకుండలా మారిన ప్రాజెక్టులు
ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ప్రాణహిత, గోదావరి మహోగ్రరూపం దాల్చాయి. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో.. క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 70 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, వెయ్యి క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 1,069 అడుగులుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా ఒక వేయికి…