గాఢ నిద్రలో ఉలిక్కిపాటు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మంటలు..! | Private Bus Catches Fire on NH 44: Hyderabad Bengaluru Route, Driver’s Quick Action Saves Lives
అనంతపురం: హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో NH-44పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TG 13T 1985 నంబర్ గల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తోంది. మిడుతూరు సమీపంలోకి చేరుకున్న సమయంలో…