Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు! | Medak School Children Perform Traditional Frog Ritual, Pray to Rain God for Timely Monsoon
భానుడి భగభగలకు భూమాత అల్లాడిపోతోంది. వర్షాలు లేక అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు పండాలని కోరుకుంటూ మెదక్ జిల్లాలో పాఠశాల విద్యార్థులు చేసిన వినూత్న ప్రార్థన అందరినీ ఆకట్టుకుంది. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకుంటూ చిన్నారులు చేసిన నృత్యం గ్రామస్తులను కదిలించింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల వేదికగా ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షాలు సమృద్ధిగా కురిసి, లోకం…