స్క్రీన్‌షాట్ తీస్తే జ్ఞాపకశక్తి శాశ్వతంగా దెబ్బతింటుందా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు! | Screenshots Harming Memory? New Study on Digital Photos Impact on Your Brain
ఏదైనా ముఖ్యమైన సమాచారం కనిపించిందా? వెంటనే స్క్రీన్‌షాట్ తీసుకోవడం.. మనలో చాలామందికి రోజువారీ అలవాటుగా మారిపోయింది. ఫోన్‌లో సేవ్ చేసుకుంటే ఎప్పుడైనా చూసుకోవచ్చని భావిస్తాం. కానీ తాజాగా అమెరికాలోని బింగ్‌హామ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనం ఈ అలవాటుపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యమైన సమాచారాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోవడం మాత్రమే చేసి, తర్వాత దాన్ని తిరిగి చూడకపోతే.. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ‘ఫోటో-టేకింగ్ ఇంపెయిర్‌మెంట్ ఎఫెక్ట్’ అంటే…