Hyderabad: మూసీ నది నీటి వ్రవాహంలో కొట్టుకు వచ్చిన గుర్తుతెలియని మృతదేహం..! | Hyderabad: Unidentified Body Found in Musi River, Amberpet Police Investigate
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో మూసీ నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. శనివారం (ఆగస్టు 22) నది మధ్యలో మృతదేహం కొట్టుకురావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అంబర్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూసీ నదిలో ప్రవాహం మధ్యలో మృతదేహం ఉండటంతో దాన్ని బయటకు తీసేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతదేహం ఓ పురుషుడిదిగా పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతుడి వయసు, పేరు, చిరునామా తదితర…