Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్! | Hyderabad: Wife arrested for killing husband and staging it as road accident in Medipally Uppal
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఓ వ్యక్తి హత్య కేసును ఉప్పల్ మేడిపల్లి పోలీసులు ఛేదించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక హత్య ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతుడి భార్య సునీతే హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జాదిగూడ, రాఘవేంద్ర కాలనీలో సత్యనారాయణ…