ఉదయం ఉత్తమ ఉద్యోగి అవార్డు.. రాత్రికే గుండెపోటుతో 108 ఉద్యోగి మృతి..! | Best Employee Award in the Morning, Heart Attack Death at Night: Tragic End for 27 Year Old 108 Employee
గద్వాల, ఆగస్ట్ 17: విధి నిర్వహణలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఓ 108 అంబులెన్స్ ఉద్యోగి.. ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న కొన్ని గంటల్లోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా చెనుగోనిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలోని చెనుగోనిపల్లికి చెందిన జహంగీర్ (27) అలంపూర్‌లో 108 అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా అత్యవసర సమయాల్లో బాధితులకు వైద్య…