Milk: పాలు శాఖహారమా, మాంసహారమా? 99 శాతం మందికి అస్సలు తెలియని నిజం!
సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం ఏది అనే విషయం వస్తే.. అందులో పాల ఉత్పత్తులు ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాయి. ఎందుకంటే ఇందులో మన శరీరానికి అవసరమైన క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా కండరాల బలానికి, శరీర శక్తికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే మన దేశంలో ఆవులు, గేదెలు, మేకల పాలను పూర్తి శాఖాహారంగానే భావిస్తారు. కానీ అమెరికా వంటి కొన్ని దేశాల్లోని…