మాయదారి పాము.. హాస్టల్‌లో నిద్రపోతున్న ఆరుగురిని కాటేసిన కాలనాగు. ముగ్గురు మృతి! | A venomous snake bit six students sleeping in hostel; three died another is in critical in Gadchiroli District
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ సహాయం పొందుతున్న ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటేయడంతో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌కు తరలించారు. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గడ్చిరోలి జిల్లా జప్తలై గ్రామంలోని ప్రాథమిక-మాధ్యమిక ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో సోమవారం (ఆగస్టు 10) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. హాస్టల్‌లో నిద్రిస్తున్న…