Hyderabad: కోకాపేట్‌లో మళ్లీ భూముల జాతర.. వేలానికి సిద్ధమైన HMDA.. ఎకరానికి 100 కోట్లపైనే.. | HMDA Mega Land Auction: Kokapet Neopolis and Golden Mile Sites Up for Bids
కోకాపేట్‌లోని ఖరీదైన భూముల వేలానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ రంగం సిద్ధం చేసింది. నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలోని భూములను వేలం వేయనుండగా.. వీటికి భారీ ధరలు పలికే అవకాశం ఉంది. నియోపోలిస్‌లో ఎకరాకు కనీస ధరను రూ.120 కోట్లుగా, గోల్డెన్ మైల్‌లో ఎకరాకు రూ.70 కోట్లుగా HMDA నిర్ణయించింది. కోకాపేట్ నియోపోలిస్‌లో గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఆ వేలం ద్వారా HMDAకు సుమారు రూ.1,000 కోట్ల ఆదాయం…