Home Tips: బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మెషీన్‌లో కొద్దిగా వెనిగర్ వేస్తున్నారా?.. అసలు ప్రయోజనాలు ఇవేనట!
వెనిగర్ అనేది డిటర్జెంట్‌కు ప్రత్యామ్నాయం కాదు. అలాగే ప్రతి రకమైన బట్టకు ఇది సరిపోదు. సరైన మోతాదులో, అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తే కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి వెనిగర్‌ను వాషింగ్ మెషీన్‌లో ఎందుకు ఉపయోగిస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. 1. బట్టలలోని దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది తువ్వాళ్లు, జిమ్ దుస్తులు లేదా తేమ వాసన వచ్చే బట్టల్లో ఉండే దుర్వాసనను తగ్గించడంలో వైట్ వెనిగర్ ఉపయోగపడవచ్చు. ఫ్యాబ్రిక్ సాఫ్టెనర్ స్థానంలో…