Kobbari Pulihora: ఈ కొబ్బరి పులిహోర తిన్నవాళ్లు రెసిపీ అడగకుండా ఉండలేరు! ప్రసాదాలు, లంచ్‌బాక్స్‌కు సూపర్!
పచ్చి కొబ్బరి తియ్యదనం, పచ్చిమిర్చి కారం, నిమ్మరసం లేదా మామిడికాయ తురుము పులుపుదనానికి ఆవాలు, కొత్తిమీర సువాసనలు తోడైతే ఈ పులిహోర ఇచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. లంచ్ బాక్స్‌లకు సైతం చల్లారిన తర్వాత కూడా కమ్మగా ఉండే ఈ అద్భుతమైన కొబ్బరి పులిహోర తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: పావు కిలో – ఒక గ్లాసు బియ్యం, అర చెక్క తాజా పచ్చి కొబ్బరి ముక్కలు, 5 నుండి 6 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, రెండు రెమ్మల…