అమృతం కోసం చాలా కష్టపడ్డాం.. ఆ సీరియల్‌లో ఎవరెవరు నటించారో తెలిస్తే షాక్ అవుతారు
అమృతం సీరియల్ తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక మైలురాయి. అయితే, ఈ సీరియల్ వెనుక దర్శకుడు ఎస్.ఎస్. కాంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, సృజనాత్మక పరిష్కారాలతో ముందుకు సాగారు. ఆయన మాటల్లోనే, అమృతం సీరియల్ చాలా తక్కువ బడ్జెట్‌లో రూపొందిందని, ఇది నటుల ఎంపికలో తీవ్రమైన ఇబ్బందులను సృష్టించిందని తెలుస్తుంది. మంచి నటులను పిలవాలంటే, అప్పట్లో ఒక్క రోజుకు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉండేది. అందంగా కనిపించే, కాస్త అనుభవం ఉన్న నటీమణులకు రెండు వేల నుండి…