మాన్‌సూన్ దెబ్బకు రైతుల్లో టెన్షన్.. ఇప్పుడు సీన్ మారింది! ఖరీఫ్‌పై మాక్వైరీ గుడ్ న్యూస్
Rainfall Deficit: భారత్‌లో నైరుతి రుతుపవనాల పరిస్థితి ఇటీవలి నెలల్లో గణనీయంగా మెరుగుపడింది. దీంతో ఖరీఫ్ పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనలు తగ్గుతున్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మాక్వైరీ తన నివేదికలో వెల్లడించింది. అయితే వర్షపాతం అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండకపోవడం కీలక అంశంగా మారిందని పేర్కొంది. మాక్వైరీ అంచనా ప్రకారం.. దేశంలో వర్షపాతం పరిస్థితి “మెరుగుపడుతోంది.. కానీ ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు”. జూన్ 16న 35 శాతంగా ఉన్న సంచిత…