Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా.. | Massive Theft in Tirupati Sonovision: Mobiles Worth Rs 2 Crore Stolen
టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి భారీ చోరీ కలకలం రేపింది. అన్నమయ్య సర్కిల్‌లో ఉన్న సోనోవిజన్ మొబైల్ షాపులోకి అర్ధరాత్రి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు అందినకాడికి దోచుకెళ్లారు. షోరూం గోడకు భారీ రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన కేటుగాళ్లు.. షాపులో ఉన్న మొబైల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లారు. ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన యజమాని.. గోడకున్న రంధ్రం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా, ర్యాక్‌లలో ఉండాల్సిన ఫోన్‌లు కనిపించకపోవడంతో స్థానిక…