Ranganath: హైకోర్టు ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఏమన్నారంటే.. | Telangana High Court Orders Removal of HYDRA Commissioner Ranganath: Ranganath and Govt React
హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రంగనాథ్ స్పందించారు. తాము రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే పనిచేస్తున్నామని, చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటివరకు సుమారు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించి, వేల ఎకరాల భూములను వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించిందని, ఇటీవల లోతుకుంటలో భూకబ్జా యత్నాన్ని కూడా అడ్డుకుందని తెలిపారు. ఆక్రమణల తొలగింపుతో పాటు ఇప్పటికే 6 చెరువులను పూర్తిస్థాయిలో…