తిరుమలలో వింత.. నీళ్ల కోసం కొళాయి తెరిస్తే పాలు వస్తున్నాయి! టెస్ట్ చేయించి నిజం తేల్చిన టీటీడీ | Why Is Water Turning White at Tirumala Japali Theertham? TTD Explains the Real Reason
శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు కొందరు కొండపై పలు ప్రాంతాలకు వెళ్తారు. పాప నాశనం ఆకాశగంగ, శిలాతోరణం, శ్రీవారి పాదాలు జపాలి ఇలా పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఇలా జపాలి తీర్థానికి వెళుతున్న భక్తులకు ఇప్పుడు కొత్త అనుభూతి ఎదురవుతోంది. జపాలి తీర్థం వద్ద కుళాయిల్లో తాగునీరు తెల్లగా పాలవలె కనిపిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న తాగునీటి కొళాయిల్లో ధవళ వర్ణంలో తాగునీరు వస్తుండడం భక్తుల్లో…