‘అసలు దాడి ఇప్పుడే మొదలవుతుంది’.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్..! హోర్ముజ్‌లో హైటెన్షన్! | US President Donald Trump Warns Of Biggest Attack As Strikes Begin, Iran Says US Will Regret
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతున్నాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిలో ల్యాండ్‌మైన్‌లు ఏర్పాటు చేసేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలను…