నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు! కొత్తగా ఎన్ని పోస్టులు కలిశాయంటే..
హైదరాబాద్, ఆగస్ట్ 20: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఉద్యోగార్థులకు కీలక ప్రకటన విడుదల చేసింది. జులైలో ప్రకటించిన CEN No. 04/2026 నోటిఫికేషన్‌కు సంబంధించి ఖాళీల సంఖ్యను పెంచింది. గతంలో ప్రకటించిన 3,993 పోస్టులకు అదనంగా 36 ఖాళీలను చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 4,029కు చేరింది. తాజా సవరణలో భాగంగా 35 కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులను కొత్తగా చేర్చారు. అలాగే RRB సికింద్రాబాద్ జోన్‌లో జూనియర్ ఇంజినీర్/ఎలక్ట్రికల్/టీఆర్‌ఎస్ విభాగంలో…