కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? | Popcorn Isn’t Just a Movie Snack: Here Are Its Surprising Health Benefits
తక్కువ నూనెతో, ఉప్పు, వెన్న, చక్కెర వంటి పదార్థాలను పరిమితంగా ఉపయోగించి తయారు చేస్తే పాప్‌కార్న్ ఆరోగ్యకరమైన స్నాక్‌గా మారుతుంది. పాప్‌కార్న్‌ను మొక్కజొన్న గింజలతో తయారు చేస్తారు. ఇందులో పీచుపదార్థం, కొంత ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే శరీరానికి ఉపయోగపడే కొన్ని యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో లభిస్తాయి. అయితే పాప్‌కార్న్ ఆరోగ్యకరమైనదా లేదా అనేది ప్రధానంగా దాన్ని ఎలా తయారు చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. తక్కువ నూనెతో లేదా ఎయిర్-పాప్ చేసిన…