Tirupati: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం | Rare Six Armed Goddess Statue Unearthed During Employment Guarantee Works in Chandragiri video tv9d – Viral Videos in Telugu
తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. పనుల్లో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా అపరకాళి విగ్రహం బయటపడింది. బ్రహ్మంగారి గుడి వద్ద కార్మికులు పనులు చేస్తుండగా ఈ విగ్రహం భూమిలో లభించింది. ఆరు భుజాలు, ఆరు అస్త్రాలతో, రాక్షసుడిని కాళ్లకింద తొక్కి వధిస్తున్నట్లుగా ఉన్న అమ్మవారి చండప్రచండ స్వరూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. విగ్రహాన్ని జాగ్రత్తగా వెలికితీసిన స్థానికులు వెంటనే పండితుల ఆధ్వర్యంలో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అద్భుత…