విద్యార్థుల వరుస మరణాలు.. ఏజెన్సీలో మరోసారి కలకలం.. | Polavaram District: 10 Year Old Girl Dies Of Fever, Malaria Cases Raise Health Concerns In Chintur Agency
పోలవరం జిల్లా చింతూరు ఏజన్సీలో వరుసగా విద్యార్థులు మృతి చెందటం కలచివేస్తోంది. ఆదివారం కోతులగుట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే.. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎటపాక మండలం గొల్లగుప్ప గిరిజన గ్రామానికి చెందిన పద్దం రోజా అనే 10 ఏళ్ల బాలిక జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ భద్రాచలం ఆసుపత్రిలో మృతి చెందింది. గొల్లగుప్ప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని జ్వరంతో మృతి చెందడం ఏజెన్సీని…