500 మీటర్ల దూరంలో ఉన్న కిచ్చా నది.. చూస్తుండగానే ట్యాంక్‌నే మింగేసింది! | Uttar Pradesh: Rs 3.97 Cr Jal Jeevan Mission Water Tank Collapses into Kiccha River in Bareilly
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, నదుల ఉధృతితో ప్రభుత్వ అభివృద్ధి పనులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బరేలీ జిల్లాలోని షేర్‌గఢ్ బ్లాక్ పరిధిలో బైరామ్‌నగర్ గ్రామ పంచాయతీలో జల్ జీవన్ మిషన్ కింద నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ కిచ్చా నదిలో మునిగిపోయింది. సుమారు రూ.3.97 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ట్యాంక్ నదీ కోతకు గురై కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. గత వారం కిచ్చా నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో…