Headlines

తెలంగాణ పల్లె నుంచి విదేశాల వరకు.. అంకాపూర్ చికెన్‌కు ఇంత క్రేజా? అదరగొడుతున్న రుచి!

దేశీ కోడి మాంసం, అంకాపూర్‌ ప్రత్యేకమైన మసాలా మిశ్రమం, సంప్రదాయ వంట పద్ధతి.. ఈ మూడు కలయికే ఈ రుచికి అసలైన ప్రత్యేకత.కోడిని ముక్కలుగా చేసి.. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాలు తదితర స్థానిక పదార్థాలతో మసాలా సిద్ధం చేస్తారు. ఆ మసాలాను చికెన్‌కు బాగా పట్టించి.. నెమ్మదిగా ఉడికించడం రుచిని మరింత పెంచుతారు. తరతరాలుగా వస్తున్న వంట అనుభవంతో.. ఎవరి కొలతలు వారికి ఉన్నా.. తుది రుచిలో మాత్రం అంకాపూర్ ముద్ర స్పష్టంగా…

Read Full News

థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది? | Munna Bhaiyas Grand Return: Mirzapur Film Hits Theatres VIDEO tv9d – Entertainment Videos in Telugu

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పుడు సినిమా రూపంలో థియేటర్లలో విడుదలయ్యింది. ఇది సీజన్-3 తర్వాత వచ్చే కథ కాదని, 2018లో జరిగిన సీజన్-1 మధ్యలో జరిగిన ఒక అన్టోల్డ్ స్టోరీ అని రివ్యూలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ మున్నా భయ్యా (దివ్యేందు) తిరిగి రావడం. థియేటర్లలో దివ్యేందు కనిపించిన వెంటనే ఈలలు, గోలలు మామూలుగా లేవని ప్రేక్షకులు చెబుతున్నారు. కలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి తన క్లాస్ అండ్…

Read Full News

పచ్చి కోడి గుడ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి | Raw eggs drinking health risks

శరీరానికి ప్రోటీన్ అందాలంటే గుడ్డు మంచి ఆహారమనే విషయం తెలిసిందే. అయితే కొందరు గుడ్డును ఉడికించకుండా పచ్చిగానే తాగుతుంటారు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారు, బాడీబిల్డింగ్ చేసేవారిలో ఈ అలవాటు కనిపిస్తుంది. పచ్చి గుడ్డు తాగితే ఎక్కువ పోషకాలు లభిస్తాయని భావిస్తుంటారు. కానీ ఇది పూర్తిగా సురక్షితమైన పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాక్టీరియా ప్రమాదం పచ్చి గుడ్డులో సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి గుడ్డును తాగితే ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యే ప్రమాదం…

Read Full News

కాకరకాయ ఎందుకు చేదుగా ఉంటుంది..? దాని వెనుకున్న అసలు గుట్టు ఇదే.. | Why Bitter Gourd is Bitter, Science Behind it, Does Karela Juice Really Cure Diabetes?

కాకరకాయ పేరు వినగానే చాలామందికి దాని చేదు రుచే గుర్తొస్తుంది. అయితే ఈ చేదు వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి? పచ్చి కాకరకాయ రసం తాగితే నిజంగానే షుగర్ నయమవుతుందా? అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. కాకరకాయలోని తీవ్రమైన చేదు రుచికి అందులో ఉండే మొమార్డిసిన్, కుకుర్బిటాసిన్ వంటి కుకుర్బిటేన్ రకం ట్రైటెర్పెనాయిడ్ సమ్మేళనాలే కారణం. ఇది ప్రకృతి సిద్ధంగా ఆ మొక్కకు లభించిన సహజ రక్షణ వ్యవస్థ. శాకాహార జంతువులు, హానికర కీటకాల బారిన…

Read Full News

Tollywood: ఎన్టీఆర్ విష్ణుమూర్తి పాత్ర.. ఆ నాలుగింటిలో రెండు చేతులు ఎవరివంటే..? | NTRs Vishnu Avatars: The Untold Story of Jaya Rami Reddys Hands

తెలుగు సినిమా చరిత్రలో నటరత్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్థానం అద్వితీయం. ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు, దైవాల గెటప్‌లకు ఆయన పర్యాయపదంగా నిలిచారు. శ్రీకృష్ణుడి పాత్రను ఎన్నో చిత్రాల్లో పోషించి కృష్ణుడు అంటే ఎన్టీఆరే అన్నంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన మరికొన్ని సినిమాల్లో విష్ణుమూర్తి గెటప్‌లోనూ దర్శనమిచ్చారు. సాధారణంగా విష్ణుమూర్తిని నాలుగు చేతులతో చిత్రీకరిస్తారు. మరి ఎన్టీఆర్ విష్ణు గెటప్‌లో కనిపించినప్పుడు ఈ అదనపు రెండు చేతులను ఎలా నిర్వహించారు అనే ప్రశ్న చాలా…

Read Full News

పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురు.. సరదా సంభాషణ.. నెట్టింట వైరల్! | Father And Daughter Pilots In US Cross Paths On Airport Radio Their Exchange Wins Hearts

Father And Daughter Pilots In Us Cross Paths On Airport Radio Their Exchange Wins Hearts అమెరికాలోని వాషింగ్టన్ విమానాశ్రయంలో అనుకోని ఘటన జరిగింది. వేర్వేరు విమానాలను నడుపుతూ విధి నిర్వహణలో ఉన్న ఓ తండ్రీ కూతురు… ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) రేడియో ద్వారా అనుకోకుండా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా, భావోద్వేగ సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విమానాశ్రయంలో ఒకే సమయంలో…

Read Full News

Hanuman Ansh: బాక్సాఫీస్ షేక్ చేస్తున్న హనుమాన్ అంశ్.. ఈ సినిమా ప్రొడ్యూసర్ 21 ఏళ్ల అమ్మాయి.. | Know About Box Office Sensation Hanuman Ansh Movie Producer Anupriya Nagar

హనుమాన్ అంశ్.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. స్టార్ హీరోహీరోయిన్లు, గ్లామర్ పాటలు లేకపోయినప్పటికీ ఈ సినిమా చూసేందుకు జనాలు బారులు కట్టారు. అయితే సినిమా కథ, కథనం ఒక ఎత్తు అయితే ఇప్పుడు అంతా ఈ మూవీ ప్రొడ్యుసర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కేవలం 21 ఏళ్ల అమ్మాయి ఈ చిత్రాన్ని నిర్మించింది. అవును. మీరు విన్నది…

Read Full News

NEET PG అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తొలిసారి ఆన్సర్ కీ! మీ జవాబులు చెక్ చేసుకోండి!

దేశవ్యాప్తంగా వేలాది మంది వైద్య అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న NEET PG 2026 ఆన్సర్ కీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈసారి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తొలిసారిగా అధికారిక ఆన్సర్ కీని అందుబాటులోకి తీసుకురానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షా ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సెప్టెంబర్ 7 నాటికి NBEMS అధికారికంగా ఆన్సర్ కీ విడుదల తేదీని ప్రకటించలేదు. తాజా విద్యా రంగ నివేదికల…

Read Full News

Basement Construction: కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? | New House Foundation Cost: 1200 Sq Ft Basement Construction Expenses in Telugu

Basement Construction: కొత్త ఇంటి నిర్మాణం చేపట్టేవారికి పునాది (బేస్మెంట్) వేయడానికి అయ్యే ఖర్చుల గురించి పూర్తి అవగాహన అవసరం. ఇందులో 133 గజాలు (సుమారు 1200 చదరపు అడుగులు, 40 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు) ఉన్న ఒక ఇంటి పునాది నిర్మాణానికి అయ్యే వివిధ ఖర్చులను వివరంగా తెలుసుకుందాం. దీనికి సంబంధించిన వివరాలు ఓ ఇంటిని నిర్మించిన యజమాని ద్వారా అందిస్తున్నాము. ఈ పనులు మొత్తం ఆరు రోజుల్లో ఎనిమిది మంది వర్కర్లతో…

Read Full News

Tollywood : 395కు పైగా సినిమాలు.. విలనిజంకు కొత్త అర్థం చెప్పిన గొప్ప నటుడు.. అప్పట్లోనే బిజీ ఆర్టిస్ట్.. చివరకు.. | The Legendary Telugu Villain Who Revolutionised On Screen Antagonism, He Is Rakta Kanneeru Star Nagabhushanam

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతినాయక పాత్రలకు కొత్త కోణాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చిన అరుదైన నటుడు చుండి నాగభూషణం. విలన్‌గా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయంటే ఆయన నటనలోని ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. విలనీకి హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించి తనదైన ముద్ర వేసుకున్న నాగభూషణం జీవితం, ఒక కళాకారుడి అవిశ్రాంత కృషికి నిదర్శనం. 1921 ఏప్రిల్ 19న నెల్లూరు జిల్లాలోని అనకర్లపూడి గ్రామంలో రాఘవరావు, సీతమ్మ దంపతులకు నాగభూషణం జన్మించారు. వారిది ఆర్థికంగా బలహీనమైన…

Read Full News