Headlines

రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..

ఇక ఈ మంగళగౌరీ వ్రతం ఆచరించడం వలన అఖండ సౌభాగ్యం కలగడమే కాకుండా అన్నివిధాలుగా కలిసి వస్తుందని చెప్పుకొస్తుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో వివాహిత స్త్రీలు మంగళగౌరీ వ్రతం ఆచరించి, ఉపావాస దీక్షలతో అమ్మవార్లను పూజిస్తూ అష్టోత్తరాలు చదవడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పుకొస్తుంటారు. అయితే ఇంతటి పవిత్రమై రోజున కొన్ని పనులు అస్సలే చేయకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం. శ్రావణ మంగళవారం రోజున అస్సలే మాంసం, మధ్యం తీసుకోకూడదు. ముఖ్యంగా గుడ్లు, చేపలు,…

Read Full News

Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్! | Hyderabad: Wife arrested for killing husband and staging it as road accident in Medipally Uppal

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఓ వ్యక్తి హత్య కేసును ఉప్పల్‌ మేడిపల్లి పోలీసులు ఛేదించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక హత్య ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతుడి భార్య సునీతే హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జాదిగూడ, రాఘవేంద్ర కాలనీలో సత్యనారాయణ…

Read Full News

రోజుకో కొత్త రూట్.. మెదడుకు సూపర్ బూస్ట్.. ట్యాక్సీ డ్రైవర్ల దెబ్బకు ఆ రోగం పని ఖతం.. | Why Taxi Drivers Have a Lower Risk of Alzheimers, New Study Explains

మతిమరుపు సమస్య అయిన అల్జీమర్స్ వృద్ధాప్యంలో చాలామందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్య. అయితే ఇతర వృత్తులతో పోలిస్తే టాక్సీ డ్రైవర్లలో అల్జీమర్స్ సంబంధిత మరణాల రేటు గణనీయంగా తక్కువగా ఉందని అమెరికాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిరంతరం కొత్త మార్గాలను ఎంచుకోవడం, రోడ్లు, లొకేషన్లను గుర్తుంచుకోవడం వంటి పనులు వారి మెదడుకు నిరంతరం వ్యాయామం అందించడమే ఇందుకు కారణమని పరిశోధకులు గుర్తించారు. టాక్సీ నడిపే సమయంలో డ్రైవర్లు ఏ మార్గంలో…

Read Full News

మీరు ప్రతి గాయానికి పసుపు వాడుతున్నారా..? డాక్టర్లు చెబుతున్న నిజం తెలిస్తే.. | Can You Apply Turmeric to Every Wound? Know the Science and Safe Uses

భారతీయ ఇళ్లలో, ఎవరికైనా దెబ్బ తగిలినా లేదా కోత పడినా, మొదటగా పసుపును పూయమని సలహా ఇస్తారు. ఈ చికిత్సా పద్ధతి ఎన్నో ఏళ్లుగా వాడుకలో ఉంది. దాదాపు ప్రతి ఇంట్లోనూ దీనిని ఉపయోగిస్తారు. అయితే, అన్ని రకాల గాయాలకు పసుపు మేలు చేస్తుందనే నమ్మకం సరైనదేనా? గాయాలను మాన్పడంలో పసుపు నిజంగా ఎలా సహాయపడుతుందో, దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. పసుపు గాయాలను ఎలా మాన్పుతుంది?: పసుపులో కర్క్యుమిన్ అనే కీలకమైన…

Read Full News

Budh Gochar: బుధుడి కటాక్షంతో ఇక వారికి కొత్త జీవితం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..? | Mercury Transit 2026: These 6 Zodiac Signs May See Income, Career and Authority Gains

సాధారణంగా గ్రహాలు రాశి మారినప్పుడల్లా వివిధ రాశుల వారి జీవితాల్లో కొద్దో గొప్పో మార్పులు జరుగుతుంటాయి. అందులోనూ బుధుడు వంటి చురుకైన గ్రహం రాశి మారినప్పుడు తప్ప కుండా కొన్ని రాశుల వారి జీవితాల్లో సత్వర మార్పులు చోటు చేసుకుంటాయి. బుద్ధి కారకుడైన బుధుడు ఈ నెల(ఆగస్టు) 23న కర్కాటక రాశిని వదిలి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సెప్టెంబర్ 7 వరకూ ఇదే రాశిలో కొనసాగే బుధ గ్రహం వల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం,…

Read Full News

Auto Tips: కారు ఇంజన్‌లో కూలెంట్‌ అయిపోతే ఏమవుతుంది? కలిగే నష్టం ఏంటి? | What should do if car runs out of coolant Auto Tips here know details here

Auto Tips: కారు ఇంజిన్‌ను సరైన ఉష్ణోగ్రతలో ఉంచడంలో కూలెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ, ఇంజిన్ అతిగా వేడెక్కి సమస్యలు తలెత్తే వరకు చాలా మంది కూలెంట్ స్థాయిని తనిఖీ చేయరు. కూలెంట్ అనేది నీరు, యాంటీఫ్రీజ్‌ల మిశ్రమం, ఇది ఇంజిన్ అతిగా వేడెక్కకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. కూలెంట్ స్థాయి బాగా తగ్గిపోయినా లేదా పూర్తిగా అయిపోయినా అది ఇంజిన్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితి డ్రైవింగ్ చేసేటప్పుడు భద్రతాపరమైన ప్రమాదాన్ని కూడా…

Read Full News

నేల రంగు వెనుక ఇంత కథ ఉందా? మట్టిలోనే దాగుంది పంట రహస్యం.. ఏ మట్టికి ఏ పంటో తెలుసా! | Soil color changes crop selections: Farmer’s Guide to Soil Types, Nutrients, Best Practices, Things farmers must know

వ్యవసాయంలో నేల నాణ్యతకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒకే పంటను అన్ని రకాల నేలల్లో సాగు చేయడం సాధ్యం కాదు. నేలలోని పోషకాలు, నీటిని నిలుపుకునే సామర్థ్యం, ఆమ్లత్వం, సేంద్రియ పదార్థాల పరిమాణం వంటి అంశాలను బట్టి పంటల దిగుబడి మారుతుంది. ముఖ్యంగా నేల రంగును గమనించడం ద్వారా దాని స్వభావం గురించి ప్రాథమిక అవగాహన పొందవచ్చు. అయితే రంగు ఆధారంగా మాత్రమే తుది నిర్ణయం తీసుకోకుండా.. నేల పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. నల్ల నేల లక్షణాలు…

Read Full News

మనలాగే జంతువులకు కూడా కంటిచూపు తగ్గి సైట్ వస్తుందా? పెట్ లవర్స్ తెలుసుకోవాల్సిందే! | Do Pets Also get Poor Eyesight With Age? Signs of Vision Loss in Dogs and Cats

మనుషులకు వయసు పెరిగేకొద్దీ చూపు మందగించడం, దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం, కళ్లద్దాలు అవసరం కావడం సాధారణమే. అయితే ఇదే సమస్య జంతువులకు కూడా వస్తుందా? కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పక్షులు వంటి జంతువులకు వృద్ధాప్యంలో కళ్లు సరిగ్గా కనిపించకుండా పోతాయా? అంటే జంతువులకు కూడా సైట్ వస్తుందా? అనే ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వయసుతో కళ్లలో మార్పులు జంతువుల కళ్లలో కూడా వయసు పెరిగేకొద్దీ సహజమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…

Read Full News

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 36 తప్పులు చేసిన శుభ్మన్ గిల్.. పరువు తీస్తోన్న సొంత టీంమేట్స్..! | Team india captain shubman gill worst drs record in sri lanka vs india 1st test

టీమిండియా యువ ఆటగాడు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా, మైదానంలో తీసుకునే డీఆర్‌ఎస్ (DRS) నిర్ణయాల విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తన కెప్టెన్సీ కెరీర్‌లో ఇప్పటివరకు తీసుకున్న రివ్యూలలో అత్యధిక శాతం ఫ్లాప్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు గిల్ ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నాడు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? గాలె టెస్టులో బౌలర్లు, కీపర్లు చేసిన ఆ రెండు ఘోరమైన తప్పులు…

Read Full News

నితిన్ నబిన్ కొత్త టీమ్ రెడీ.. పురందరేశ్వరీ, వసుంధర రాజేకు కీలక బాధ్యతలు..! | BJP National Executive Reshuffle: Nitin Nabin’s New Team announced after 7 months

ఏడు నెలల తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తన కొత్త టీమ్‌ను ప్రకటించారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగత బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక పదవుల్లో మార్పులు, చేర్పులు చేశారు. కొత్త కార్యవర్గంలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించగా.. మరికొందరికి పదవులు కొనసాగించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా మొత్తం 13 మందిని నియమించారు. ఇందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్ మాధవ్, పురంధేశ్వరి…

Read Full News