కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!
కరీంనగర్, ఆగస్ట్ 17: చదువుపై ఉన్న ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని నిరూపించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వడ్లకొండ సింధూజ. జమ్మికుంట గణేష్‌నగర్‌కు చెందిన వడ్లకొండ శ్రీనివాస్–వనజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శృతికి వివాహం కాగా, చిన్న కుమార్తె సింధూజకు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి ఉండేది. ఆమె అభిరుచిని గమనించిన తండ్రి శ్రీనివాస్ ఉన్నత చదువులు అభ్యసించేందుకు ప్రోత్సహించారు. సింధూజ జమ్మికుంటలో ప్రాథమిక విద్య,…